ePaper
More
    HomeజాతీయంOnline Gaming | ఆన్​లైన్​ గేమ్స్​ ఆడి ఎంత పోగొట్టుకుంటున్నారంటే.. తెలిస్తే షాక్​ అవ్వాల్సిందే?

    Online Gaming | ఆన్​లైన్​ గేమ్స్​ ఆడి ఎంత పోగొట్టుకుంటున్నారంటే.. తెలిస్తే షాక్​ అవ్వాల్సిందే?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Online Gaming | దేశంలో ఎంతో మంది ఆన్​లైన్​ గేమ్స్​, బెట్టింగ్​కు బానిసలు మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఆన్​లైన్​ బెట్టింగ్​ మాయలో పడి అప్పుల పాలు అవుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆన్​లైన్​ బెట్టింగ్(Online Betting)​, గేమ్స్​ నిషేధిస్తూ బిల్లు ఆమోదించిన విషయం తెలిసిందే.

    ఆన్​లైన్​ గేమింగ్(Online Gaming)​ బిల్లు లోక్​సభ, రాజ్యసభలో ఆమోదం పొందింది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఆ బిల్లు చట్టరూపం దాల్చనుంది. అయితే ఆన్​లైన్​ గేమింగ్​తో దేశంలో ఏటా ఎన్ని కోట్లు నష్టపోతున్నారనే లెక్కలను కేంద్రం వెల్లడించింది. దేశవ్యాప్తంగా దాదాపు 45 కోట్ల మంది ఏడాదికి సుమారు రూ.20 వేల కోట్లు(20 Thousand Crores) ఆన్​లైన్​ గేమ్స్​, బెట్టింగ్​లో పోగొట్టుకుంటున్నారు.

    Online Gaming | అత్యాశకు పోతే..

    ఆన్​లైన్​ గేమ్స్​లో చాలా రకాలు ఉంటాయి. కొన్ని అధృష్టం (లక్) పద్ధతిలో డబ్బులు ఎర వేస్తాయి. మరికొన్ని ఆటలు ఆడాల్సి ఉంటుంది. రమ్మీ(Rummy), తీన్​పత్తి లాంటి గేమ్స్​. వీటిలో తక్కువ డబ్బు పెడితే భారీగా వస్తాయని ప్రకటనలు చాలామందిని ఆకర్శిస్తున్నాయి. ఈజీ మనీకి అలవాటుపడిన నేటి యువత సులువుగా ఆన్​లైన్​ గేమింగ్​ ట్రాప్​లో పడుతున్నారు. అనంతరం ఉన్నదంతా కోల్పోతున్నారు. ఆ డబ్బులను తిరిగి పొందాలని అప్పు చేసి మరి గేమ్స్​ ఆడుతున్నారు. చివరకు అప్పులు తీర్చే మార్గం లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న వారూ ఉన్నారు. ఈ క్రమంలో కేంద్రం ఆన్​లైన్​ గేమింగ్​ నిషేధిస్తూ చర్యలు చేపట్టింది. ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లును ఉభయ సభల్లో ఆమోదించింది.

    Online Gaming | విదేశాలకు తరలుతున్న సంపద

    డబ్బులు పెట్టి ఆడే ఆన్‌లైన్ గేమింగ్ సమాజానికి ప్రధాన సమస్యగా మారింది. ముఖ్యంగా బెట్టింగ్​ యాప్స్(Betting Apps)​, ఆన్​లైన్​ గేమింగ్​ నిర్వాహకులు విదేశాల నుంచి వాటిని నడిపిస్తున్నారు. దీంతో వేల కోట్ల రూపాయలు ఏటా విదేశాలకు తరలిపోతుంది. ప్రజలు నష్టపోతుండటంతో ప్రభుత్వం ఎట్టకేలకు ఆయా గేమ్స్​పై నిషేధం కోసం బిల్లు తీసుకొచ్చింది. ఈ బిల్లు అమలులోకి వస్తే ఎంతో మందికి మేలు జరనుంది. ఈ బిల్లు ప్రకారం మనీ గేమింగ్‌లో పాల్గొన్న సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వాలు(State Governments) చర్యలు తీసుకుంటాయి.

    Latest articles

    Medical College Raging case | ఎట్టకేలకు ర్యాగింగ్ కేసు నమోదు.. ఎఫ్​ఐఆర్​లో ఏముందంటే..

    అక్షరటుడే, ఇందూరు: Medical College Raging case : నిజామాబాద్‌ మెడికల్‌ కాలేజ్‌లో శనివారం జరిగిన ర్యాగింగ్​ ఘటనపై...

    CIBIL score | సిబిల్ స్కోర్ వారికి తప్పనిసరి కాదు : కేంద్రం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: CIBIL score : బ్యాంకు నుంచి తొలిసారిగా లోన్ తీసుకునేవారికి కేంద్రం తీపి కబురు చెప్పింది....

    Tollywood film industry | సినిమా పరిశ్రమ అభివృద్ధికి సంపూర్ణ సహకారం : సీఎం రేవంత్​

    అక్షరటుడే, హైదరాబాద్: Tollywood film industry : సినిమా పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని...

    TPCC Chief Mahesh | తెలంగాణలోనూ దొంగ ఓట్లు ఉన్నాయి.. టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, హైదరాబాద్: TPCC Chief Mahesh : టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోనూ దొంగ...

    More like this