అక్షరటుడే, వెబ్‌డెస్క్: PM Modi | అవినీతి ఆరోపణల్లో అరెస్టు 30 రోజులకు మించి జైలులో ఉంటే ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రులను తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులను విపక్షాలు విమర్శించడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) తీవ్రంగా తప్పుబట్టారు.
బీహార్‌లో రూ.13,000 కోట్ల చేపట్టనున్న విద్యుత్, రోడ్లు, ఆరోగ్యం, పట్టణాభివృద్ధి, నీటి సరఫరా తదితర కీలక ప్రాజెక్టులను ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విపక్షాలపై నిప్పులు చెరిగారు.
PM Modi | విపక్షాలపై ఆగ్రహం
ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు(Chief Ministers), మంత్రులను అరెస్టయిన సందర్భంలో వారిని తొలగించాలనే ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ సహా విపక్షాలను లక్ష్యంగా చేసుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్‌ను (Congress) లక్ష్యంగా చేసుకుని విమర్శలు ఎక్కుపెట్టారు. కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులను జైలు నుండి ఎందుకు పని చేయడానికి అనుమతించాలో తెలుసుకోవాలని కోరారు. కళంకిత మంత్రులు, ముఖ్యమంత్రులు జైలుకు వెళ్లినప్పటికీ వారిని ఇంకా పదవుల్లో కొనసాగించాలా? జైలు నుంచి పాలన కొనసాగించేందుకు అనుమతించాలా? అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశ్నించారు.
PM Modi | ఇదేం న్యాయం
తప్పు చేసిన ప్రభుత్వ ఉద్యోగులను కొలువుల నుంచి తొలగిస్తున్నారని, మరీ రాజకీయ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోకూడదని మోదీ ప్రశ్నించారు. “ఒక ప్రభుత్వ ఉద్యోగి 50 గంటలు జైలు శిక్ష అనుభవిస్తే, అతను డ్రైవర్ అయినా, గుమస్తా అయినా, ప్యూన్ అయినా తన ఉద్యోగాన్ని స్వయంచాలకంగా కోల్పోతాడు. కానీ ముఖ్యమంత్రి, మంత్రి లేదా ప్రధానమంత్రి జైలులో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వంలో ఉండాలా?” అని అన్నారు. “జైలు నుంచి ప్రభుత్వాలను నడిపించడానికి ఎందుకు అనుమతించాలి? అరెస్టయిన కళంకిత మంత్రులను పదవులలో కొనసాగించాలా? రాజకీయ నాయకులు నైతిక సమగ్రతను కాపాడుకోవాలని ప్రజలు ఆశిస్తున్నారు” అని పేర్కొన్నారు.
PM Modi | ఆర్జెడీపై నిప్పులు..
రాష్ట్రీయ జనతాదళ్ పాలనలో బీహార్ అంధకారంలో మునిగిపోయిందని ప్రధాని తీవ్ర విమర్శలు చేశారు.
లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ రాష్ట్రాన్ని దోచుకోవడం ద్వారా బీహార్ గౌరవాన్ని దెబ్బతీసిందని మండిపడ్డారు. ఆ పార్టీ ‘గరీబీ హటావో’ నినాదాన్ని మాత్రమే లేవనెత్తిందని, కానీ దానిని సాధ్యం చేసింది ఎన్డీయే ప్రభుత్వమేనని ప్రధాని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం బీహార్ అభివృద్ధి కి చేస్తున్న కృషిని ప్రముఖంగా ప్రస్తావించిన మోదీ.. మార్హౌరాలోని లోకోమోటివ్ ఫ్యాక్టరీని (Locomotive Factory) ఉదాహరిస్తూ బీహార్ ‘మేక్ ఇన్ ఇండియా’ (Make In India) చొరవకు కేంద్రంగా మారిందన్నారు. అయితే, బీహార్ అభివృద్ధికి కాంగ్రెస్, ఆర్జేడీ వ్యతిరేకమని ఆరోపించారు.
గత ప్రభుత్వాలు ప్రజల ప్రాథమిక హక్కులను నిరాకరించడానికి ఎలా కలిసి పనిచేశాయో ప్రధాని ఎత్తి చూపారు. హస్తం, లాంతర్ కలిసి బీహార్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. వారు ధనికులుగా మారితే బీహార్ పేదరిక రాష్ట్రంగా మారిందన్నారు. కానీ ఎన్డీయే సర్కారు (NDA Government) బీహార్‌ను అభివృద్ధి బాట పట్టిస్తోందన్నారు. “మోదీ నిశ్శబ్దంగా ఉండే వ్యక్తి కాదు. బీహార్ కోసం నేను ఇంకా చాలా చేయాలి. బీహార్‌లో ‘ఆటవిక రాజ్యం’ నడిపించిన వారు ఏదో ఒక విధంగా తమ పాత పనులను పునరావృతం చేయడానికి అవకాశం కోసం చూస్తున్నారు. మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్డీయేను గెలిపించాలని” ఓటర్లకు పిలుపునిచ్చారు.