ePaper
More
    Homeఅంతర్జాతీయంAmerica | అమెరికా సంచ‌ల‌న నిర్ణ‌యం.. 5.5 కోట్ల మంది విదేశీయుల వీసాల ప‌రిశీల‌న‌

    America | అమెరికా సంచ‌ల‌న నిర్ణ‌యం.. 5.5 కోట్ల మంది విదేశీయుల వీసాల ప‌రిశీల‌న‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : America | అమెరికా ప్రభుత్వం మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే వ‌ల‌స‌ల‌పై తీవ్ర ఆంక్ష‌లు విధించిన ట్రంప్ ప్ర‌భుత్వం (Trump Administration).. తాజాగా విదేశీయుల వీసాల‌ను ప‌రిశీలించాల‌ని నిర్ణ‌యించింది. అమెరికాలోని 5.5 కోట్ల మంది విదేశీయుల వీసాల‌ను సమీక్షిస్తామని యూఎస్ విదేశాంగ శాఖ (US State Department) వెల్ల‌డించింది.

    ఇందులో ఎవ‌రైనా వలస నిబంధనల రద్దు లేదా బహిష్కరణకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అసోసియేటెడ్ ప్రెస్ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన విదేశాంగ శాఖ‌.. US వీసా హోల్డర్లు (US Visa Holders) “నిరంతర పరిశీలన”కు లోబడి ఉంటారని, వారు ఈ పత్రానికి అనర్హులని సూచించే ఏదైనా సూచనను దృష్టిలో ఉంచుకుని ఉంటారని ఆ విభాగం తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించినట్టు తెలిస్తే డిపోర్టు చేసే అవకాశం కూడా ఉందని తెలిపింది.

    America | నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే వెన‌క్కి..

    వీసా గడువు ముగిసిన తర్వాత ఉండడం, నేర కార్యకలాపాలు, ప్రజా భద్రతకు ముప్పు, ఏదైనా రకమైన ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనడం లేదా ఉగ్రవాద సంస్థకు మద్దతు ఇవ్వడం వంటి వాటికి పాల్ప‌డుతున్నారా? అని ప‌రిశీలించనున్న‌ట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ‘వీసా గడువుకు మించి అమెరికాలో ఉన్నా, క్రిమినల్ చర్యలకు దిగినా, ప్రజాభద్రతకు ముప్పుగా మారినా, ఎలాంటి ఉగ్రకార్యకలాపాలకు పాల్పడినా విదేశీయులను వెనక్కి పంపించేస్తామని విదేశాంగ శాఖ పేర్కొంది. ఉగ్రవాద సంస్థలకు ఏ రకమైన సహాయం అందించినా వీసా రద్దు (Visa Cancellation) చేసి వెనక్కి పంపించేస్తామని అన్నారు.

    America | వ‌ల‌స‌ల‌పై క‌ఠిన వైఖ‌రి..

    అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అధికారం చేపట్టినప్పటి నుండి వ‌ల‌స‌ల‌పై ఉక్కుపాద మోపుతున్నారు. గ‌త జ‌న‌వ‌రి నుంచి మ‌రింత క‌ఠినంగా వ్య‌వ‌హరిస్తున్నారు. అక్రమంగా వలస వచ్చినవారిని, విద్యార్థి, ప‌ర్యాట‌క వీసాలు కలిగి ఉన్నవారిని బహిష్కరించడంపై దృష్టి పెట్టింది. అక్ర‌మంగా నివాస‌ముంటున్న వేలాది మందిని పంపించేసింది. వీసా దరఖాస్తుదారులపై పరిపాలన క్రమంగా మరిన్ని ఆంక్షలు విధించింది, వీసా కోరుకునే వారందరూ వ్యక్తిగత ఇంటర్వ్యూలకు రావాలని స్ప‌ష్టం చేసింది.

    అంతేకాదు, వీసా ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు త‌మ సోష‌ల్ మీడియా ఖాతాల‌ను ప్రైవేట్ నుంచి ప‌బ్లిక్‌గా మార్చుకోవాల‌ని తెలిపింది. అంతేకాదు, వీసాల సంఖ్య‌ను కూడా రెండింత‌ల మేర త‌గ్గించేసింది. 6 వేల మందికి విద్యార్థుల వీసాలను ఇటీవ‌ల ర‌ద్దు చేసిన‌ట్లు తెలిపింది. ఆ 6,000 వీసాలలో దాదాపు 4,000 వీసాలు ఉగ్రవాద సంబంధిత సమస్యల కారణంగా రద్దు చేయబడ్డాయని, నియమించబడిన ఉగ్రవాద సంస్థలకు లేదా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే రాష్ట్రానికి మద్దతు ఇవ్వడంతో సహా అని అది పేర్కొంది.

    Latest articles

    Medical College Raging case | ఎట్టకేలకు ర్యాగింగ్ కేసు నమోదు.. ఎఫ్​ఐఆర్​లో ఏముందంటే..

    అక్షరటుడే, ఇందూరు: Medical College Raging case : నిజామాబాద్‌ మెడికల్‌ కాలేజ్‌లో శనివారం జరిగిన ర్యాగింగ్​ ఘటనపై...

    CIBIL score | సిబిల్ స్కోర్ వారికి తప్పనిసరి కాదు : కేంద్రం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: CIBIL score : బ్యాంకు నుంచి తొలిసారిగా లోన్ తీసుకునేవారికి కేంద్రం తీపి కబురు చెప్పింది....

    Tollywood film industry | సినిమా పరిశ్రమ అభివృద్ధికి సంపూర్ణ సహకారం : సీఎం రేవంత్​

    అక్షరటుడే, హైదరాబాద్: Tollywood film industry : సినిమా పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని...

    TPCC Chief Mahesh | తెలంగాణలోనూ దొంగ ఓట్లు ఉన్నాయి.. టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, హైదరాబాద్: TPCC Chief Mahesh : టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోనూ దొంగ...

    More like this

    Medical College Raging case | ఎట్టకేలకు ర్యాగింగ్ కేసు నమోదు.. ఎఫ్​ఐఆర్​లో ఏముందంటే..

    అక్షరటుడే, ఇందూరు: Medical College Raging case : నిజామాబాద్‌ మెడికల్‌ కాలేజ్‌లో శనివారం జరిగిన ర్యాగింగ్​ ఘటనపై...

    CIBIL score | సిబిల్ స్కోర్ వారికి తప్పనిసరి కాదు : కేంద్రం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: CIBIL score : బ్యాంకు నుంచి తొలిసారిగా లోన్ తీసుకునేవారికి కేంద్రం తీపి కబురు చెప్పింది....

    Tollywood film industry | సినిమా పరిశ్రమ అభివృద్ధికి సంపూర్ణ సహకారం : సీఎం రేవంత్​

    అక్షరటుడే, హైదరాబాద్: Tollywood film industry : సినిమా పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని...