అక్షరటుడే, వెబ్‌డెస్క్: Chiranjeevi Title Glimpse | మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఎదురుచూస్తున్న బిగ్గెస్ట్ అప్‌డేట్ వచ్చేసింది. అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మెగా 157 మూవీ నుంచి టైటిల్ గ్లింప్స్ మేకర్స్ విడుదల చేశారు.
ఈ సినిమాకు చిరంజీవి అసలు పేరుతోనే టైటిల్ ఫిక్స్ చేసి ఫ్యాన్స్‌లో హైప్ పెంచారు. చిరు – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Varaprasad Garu) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్ గ్లింప్స్ వీడియోలో చిరు స్టైలిష్ లుక్, పవర్‌ఫుల్ ఎంట్రీ అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. పూర్తి సెక్యూరిటీ మధ్య మెగాస్టార్ వాకింగ్ సీన్ అదిరిపోయింది.
Chiranjeevi Title Glimpse | లుక్ అదుర్స్..
ఈ స్పెషల్ గ్లింప్స్‌కు మరో హైలైట్‌గా నిలిచింది విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) వాయిస్ ఓవర్. ‘‘మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వచ్చేస్తున్నారు’’ అనే డైలాగ్‌తో టైటిల్‌ను రివీల్ చేస్తూ ప్రేక్షకుల ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. దీంతో వెంకటేష్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారన్న ఊహాగానాలు సినిమాపై అంచనాలు రెట్టింపు చేశాయి. ఈ చిత్రంలో చిరు సరసన నయనతార హీరోయిన్‌గా (Nayantara Heroine) నటిస్తుండగా, కేథరిన్ ట్రెసా, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ – సాహు గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ – సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమా 2026 సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది. టైటిల్, గ్లింప్స్‌తోనే ఈ సినిమా సంక్రాంతి (Pongal) బరిలో హైప్‌ను బలంగా సెట్ చేసింది. ‘మన శంకర వరప్రసాద్ గారు’ టైటిల్‌తో చిరు మరోసారి పక్కా ఫ్యామిలీ, మాస్ ఎంటర్‌టైనర్‌తో స్క్రీన్‌పై సందడి చేయబోతున్నారు. టైటిల్ గ్లింప్స్‌తో మొదలైన ఈ వేడి… సంక్రాంతి వరకు ఆగదనిపిస్తోంది! పక్కా మాస్, ఫ్యామిలీ ఆడియన్స్‌కి కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.