ePaper
More
    HomeజాతీయంTraffic Challans | వాహనదారులకు గుడ్​న్యూస్​.. ట్రాఫిక్​ చలాన్లపై 50శాతం డిస్కౌంట్​.. ఎక్కడంటే?

    Traffic Challans | వాహనదారులకు గుడ్​న్యూస్​.. ట్రాఫిక్​ చలాన్లపై 50శాతం డిస్కౌంట్​.. ఎక్కడంటే?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Traffic Challans | వాహనదారులు నిబంధనలు పాటించకపోతే పోలీసులు జరిమానాలు వేస్తారు. హెల్మెట్ పెట్టుకోకున్నా.. రాంగ్​సైడ్​ డ్రైవింగ్​, ట్రిపుల్​ రైడింగ్​, అతి వేగంగా వాహనాలు నడపడం తదితర కారణాలతో పోలీసులు చలాన్లు (Fines) వేస్తుంటారు. చలా నగరాలు, పట్టణాల్లో కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా కంట్రోల్​ రూమ్​ నుంచే నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానాలు వేస్తున్నారు.

    పోలీసులు జరిమానాలు వేస్తున్నా.. చాలా మంది వాటిని చెల్లించడం లేదు. కొందరి వాహనాలపై వేల రూపాయల ఫైన్లు పేరుకుపోయాయి. ఇటీవల వరంగల్​ (Warangal)లో పోలీసులు తనిఖీలు చేయగా.. ఓ స్కూటీపై ఏకంగా రూ.45 వేల విలువైన ఫైన్లు ఉన్నాయి. దీంతో పోలీసులు షాక్​ అయ్యారు.

    Traffic Challans | కర్ణాటకలో డిస్కౌంట్​

    వాహనదారులు జరిమానాలు చెల్లించేలా ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు స్పెషల్​ డ్రైవ్​లు చేపడుతాయి. గతంలో తెలంగాణ (Telangana)లో ప్రభుత్వం ట్రాఫిక్​ చలాన్లపై భారీగా డిస్కౌంట్​ ఇచ్చింది. తాజాగా కర్ణాటక ప్రభుత్వం (Karnataka Government) సైతం వాహనదారులకు ఊరట కలిగించే వార్త చెప్పింది. ట్రాఫిక్​ జరిమానాలపై 50శాతం తగ్గింపు అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. పోలీసు శాఖ మొబైల్ ఈ-చలాన్‌లో నమోదైన పెండింగ్ కేసులకు జరిమానా మొత్తంలో 50 శాతం తగ్గింపును మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 12లోగా జరిమానాలు చెల్లించిన వారికి మాత్రమే ఈ ఆఫర్​ వర్తిస్తుందని స్పష్టం చేసింది.

    Traffic Challans | తెలంగాణలో సైతం ఇవ్వాలని..

    తెలంగాణలో కూడా ట్రాఫిక్​ జరిమానాలపై డిస్కౌంట్​ ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. ఇటీవల పోలీసులు నిత్యం వాహనాల తనిఖీ (Vehicle Checks)లు చేపడుతుండటంతో చాలా మంది వాహనాలపై చలాన్లు పేరుకుపోయాయి. అయితే కాంగ్రెస్​ అధికారంలో వచ్చిన కొత్తలో డిస్కౌంట్​ ఇచ్చింది. ప్రస్తుతం మళ్లీ ఇవ్వకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

    కాగా నిబంధనలు పాటించాలని జరిమానా వేస్తున్న ప్రభుత్వం డిస్కౌంట్​ ఇవ్వడం సరికాదని పలువురు అభిప్రాయ పడుతున్నారు. దీంతో వాహనదారుల్లో క్రమశిక్షణ దెబ్బతింటుందని పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఎలాగు డిస్కౌంట్​ ఇస్తుందని చాలా మంది ఫైన్లు కట్టడం లేదు. రాయితీ ఇచ్చినప్పుడే కడతామని అలాగే ఉంటున్నారు.

    Latest articles

    Medical College Raging case | ఎట్టకేలకు ర్యాగింగ్ కేసు నమోదు.. ఎఫ్​ఐఆర్​లో ఏముందంటే..

    అక్షరటుడే, ఇందూరు: Medical College Raging case : నిజామాబాద్‌ మెడికల్‌ కాలేజ్‌లో శనివారం జరిగిన ర్యాగింగ్​ ఘటనపై...

    CIBIL score | సిబిల్ స్కోర్ వారికి తప్పనిసరి కాదు : కేంద్రం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: CIBIL score : బ్యాంకు నుంచి తొలిసారిగా లోన్ తీసుకునేవారికి కేంద్రం తీపి కబురు చెప్పింది....

    Tollywood film industry | సినిమా పరిశ్రమ అభివృద్ధికి సంపూర్ణ సహకారం : సీఎం రేవంత్​

    అక్షరటుడే, హైదరాబాద్: Tollywood film industry : సినిమా పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని...

    TPCC Chief Mahesh | తెలంగాణలోనూ దొంగ ఓట్లు ఉన్నాయి.. టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, హైదరాబాద్: TPCC Chief Mahesh : టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోనూ దొంగ...

    More like this