అక్షరటుడే, వెబ్డెస్క్ : Godavari | ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. జలాశయంపై గల అన్ని ప్రాజెక్ట్లు నిండుకుండలా మారడంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్లోని ధవళేశ్వరం (Dhavaleswaram) వద్ద గోదావరి ఉధృతంగా పారుతోంది.
ఏపీలోని పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) వద్ద గోదావరికి భారీగా వదర వస్తోంది. పోలవరం స్పిల్‌వే వద్ద గోదావరి నీటి మట్టం 33.360 మీటర్లుగా, కాఫర్ డ్యామ్ వద్ద 25.140 మీటర్లుగా నమోదు అయింది. స్పిల్‌వే నుంచి 48 గేట్ల ద్వారా 11,55,021 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
Godavari | రెండో ప్రమాద హెచ్చరిక
ధవళేశ్వరం వద్ద గోదావరి ఉధృతంగా పారుతుండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. శుక్రవారం ఉదయం 5 గంటలకు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 13.9 అడుగుల నీటిమట్టం ఉంది. సముద్రంలోకి సుమారు 13.5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
Godavari | భద్రాచలం వద్ద..
తెలంగాణలోని భద్రాచలం (Bhadrachalam) వద్ద సైతం గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. గురువారం సాయంత్రం 52 అడుగుల నీటిమట్టానికి చేరుకుంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ప్రస్తుతం 14 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదు అవుతోంది.
గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక, 53 అడుగులకు చేరితో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. గతంలో 1986లో భద్రాచలంలో గోదావరి 76 అడుగుల నీటిమట్టంతో ప్రవహించింది. గోదావరి చరిత్రలో ఇదే అత్యధికం. అప్పుడు 27.02 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. 2022లో 71.30 అడుగులకు నీటిమట్టం చేరగా.. 24.43 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తింది.
ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ఉద్ధృతి.
ఉదయం 5 గంటలకు రెండో ప్రమాద హెచ్చరిక జారీ . ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 13.9 అడుగుల నీటిమట్టం. సముద్రంలోకి సుమారు 13.5 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల. #Dhavaleswaram #Godavari #AndhraPradesh pic.twitter.com/4OtvDTBHH8
— vyasamajaykumar ✊🏻✊🏻 (@VyasamA) August 22, 2025