అక్షరటుడే, ఆర్మూర్ : తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి (Sriramsagar project) వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. మహారాష్ట్ర Maharashtra , నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో భారీగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి 75వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది.
ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 1090.8 అడుగులకు (79.658 టీఎంసీలు) చేరింది. గురువారం అర్ధరాత్రి 12గంటలకు 16 వరద గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు.
Sriramsagar : కాల్వల ద్వారా నీటి విడుదల
ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. 16 వరద గేట్లను ఎత్తి 49వేల 280 క్యూసేక్యులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 1500 క్యూసెక్యులు, కాకతీయ కాలువ ద్వారా 6వేల 500 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 20వేల క్యూసెక్కులు, లక్ష్మి కాలువ ద్వారా 150 క్యూసెక్యులు, సరస్వతి కాలువ ద్వారా 500 క్యూసెక్యులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు వదులుతుండగా, 651 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతోంది.
మొత్తం 78వేల 812 క్యూసెక్కుల నీటిని కాలువ ద్వారా వదులుతున్నారు. వరద నీటి ప్రవాహం ఉధృతంగా ఉన్నందున గోదావరి పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు ఏ ఈఈ కొత్త రవి తెలిపారు.