అక్షరటుడే, వెబ్‌డెస్క్: Asia Cup 2025 : ఆసియా కప్‌లో Asia Cup భారత్, పాకిస్థాన్‌ల మధ్య జరగబోయే హై-వోల్టేజ్ మ్యాచ్‌లపై నెలకొన్న సస్పెన్స్‌కు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది.
భారత్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు జరగబోవని తేల్చిచెప్పిన కేంద్రం.. బహుళజాతి టోర్నమెంట్‌లలో మాత్రం భారత్ పాల్గొనవచ్చని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో రాబోయే ఆసియా కప్ టోర్నమెంట్‌లో భారత్ జట్టు పాల్గొనడం ఖరారైంది. దీంతో ఇరుదేశాల మధ్య క్రికెట్ అభిమానుల్లో నెలకొన్న అనుమానాలు తొలగిపోయాయి.
క్రీడా మంత్రిత్వ శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి మాట్లాడుతూ..”భారత్ తన విధానాన్ని మార్చలేదని, పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాల పునరుద్ధరణకు అవకాశం లేదని” స్పష్టంగా తెలిపారు.
Asia Cup 2025 : గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టేనా?
ఆసియా కప్, ఐసీసీ టోర్నీలు ICC Tournaments వంటి బహుళజాతి క్రికెట్ ఈవెంట్లు తటస్థ వేదికలపై జరిగే సందర్భంలో భారత జట్లు పాల్గొనడానికి అనుమతి ఉంటుందని అధికారి వెల్లడించారు.
ఇక 2025 ఆసియా కప్ సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుండగా.. భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 14న జరగనుంది.
ఈ టోర్నీ T20 ఫార్మాట్‌లో జరగనుండగా.. ఫైనల్ సెప్టెంబర్ 29న ఉత్కంఠభరితంగా జరగనుంది. టోర్నీలో భారత్-పాక్ జట్ల మధ్య కనీసం మూడు సార్లు తలపడే అవకాశముంది.
తొలుత సెప్టెంబరు 14న పాక్‌తో తొలి మ్యాచ్ ఆడనుండగా.. సెమీస్‌లో ఈ రెండు జట్లు తలపడే అవకాశం ఉంది. మరోవైపు ఇవే రెండు ఫైనల్‌కి చేరితే అక్కడ కూడా ఫైట్ చేస్తాయి.
అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిన విషయమేమిటంటే.. భారత జట్టు పాకిస్తాన్ Pakistan వెళ్లదని, అలాగే పాకిస్తానీ జట్టును భారతదేశంలో ఆడనివ్వబోమని తేల్చిచెప్పింది.
అయినా, అంతర్జాతీయ టోర్నీల్లో ఇరు దేశాల జట్లు తటస్థ వేదికలపై పోటీ పడే అవకాశం మాత్రం ఉంటుంది. ఇటీవల టీ20 ఆసియా కప్ కోసం భారత క్రికెట్ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే.
ముంబయిలోని బీసీసీఐ(BCCI) ప్రధాన కార్యాలయంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ జట్టును ప్రకటించగా.. భారత టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. శ్రేయస్ అయ్యర్‌కు మాత్రం మరోసారి బీసీసీఐ సెలెక్టర్లు హ్యాండిచ్చారు.