అక్షరటుడే, వెబ్‌డెస్క్: Gold Price on August 22 | గత కొన్ని రోజులుగా బంగారం Gold ధరలు తగ్గుతూ రావడం మనం చూస్తున్నాం. అయితే పెరిగే సమయంలో మాత్రం ధరలు దూసుకుపోతున్నాయి. బంగారం ధరలలో రోజుకొక మార్పు కనిపిస్తుండగా, తగ్గిన వాటి కంటే పెరిగిన ధరల స్థాయి రెట్టింపుగా ఉంటోంది.
భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారంపై ప్రత్యేక ప్రాధాన్యత చూపిస్తున్న విషయం తెలిసిందే. ఆగస్టు 22న (శుక్రవారం) బంగారం ధరలో భారీగా పెరుగుదల చోటుచేసుకుంది. గురువారంతో పోలిస్తే ఒక్క తులం బంగారంపై రూ.640 పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల 10 గ్రాముల (24 carat gold) ధర రూ.1,00,760గా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,310కి చేరింది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాములకు రూ.75,530గా నమోదైంది.
Gold Price on August 22 : మళ్లీ రెక్కలు..
ఇప్పుడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
- ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,910 గా నమోదు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,460గా ట్రేడ్ అయింది.
- ముంబయిలో Mumbai 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,760గా నమోదు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,310 గా ట్రేడ్ అయింది.
- హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,760 గా నమోదు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,310గా ట్రేడ్ అయింది.
- బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,760గా నమోదు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,310గా ట్రేడ్ అయింది.
- చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,760గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,310గా ఉంది.
- కేరళలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,760గా నమోదైనట్టు తెలుస్తుండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,310గా ఉంది.
ఇక వివిధ నగరాలలో వెండి ధరలు ఎలా ఉన్నాయనేది చూస్తే..
- చెన్నైలో రూ. 1,26,100
- ముంబయిలో రూ. 1,16,100
- ఢిల్లీలో రూ. 1,16,100
- కోల్‌కతా లో రూ. 1,16,100
- బెంగళూరులో Bangalore రూ. 1,16,100
- హైదరాబాద్‌లో రూ. 1,26,100 కేరళలో రూ. 1,26,100
- పుణెలో రూ. 1,16,100 వడోదరాలో రూ. 1,16,100
- అహ్మదాబాద్లో రూ. 1,16,100 గా ట్రేడ్ అయింది.