అక్షరటుడే, వెబ్‌డెస్క్: Gift nifty | గ్లోబల్ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా సాగుతున్నాయి. గత ట్రేడింగ్ సెషన్‌లో వాల్‌స్ట్రీట్ నష్టాలతో ముగియగా.. యూరోప్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ముగిశాయి. శుక్రవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాలతో సాగుతున్నా గిఫ్ట్‌నిఫ్టీ(Gift nifty) మాత్రం నెగెటివ్‌గా ఉంది.
Gift nifty | యూఎస్ మార్కెట్లు..
జాక్సన్ హోల్ ఎకనామిక్ సింపోజియంలో యూఎస్ ఫెడ్ చైర్మన్(Fed chiarman) జెరోమ్ పొవెల్ ప్రసంగం నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. వడ్డీ రేట్ల కోతపై ఆయన ఎలాంటి వ్యాఖ్యానాలు చేస్తారోనని ఆందోళన చెందుతున్నారు. దీంతో యూఎస్ మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. గత ట్రేడింగ్ సెషన్ ఎస్‌అండ్‌పీ(S&P) 0.40 శాతం, నాస్‌డాక్ 0.34 శాతం నష్టపోయాయి. ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.08 శాతం లాభంతో సాగుతోంది.
Gift nifty | యూరోప్ మార్కెట్లు..
ఎఫ్‌టీఎస్‌ఈ 0.23 శాతం, డీఏఎక్స్ 0.07 శాతం లాభంతో ముగియగా.. సీఏసీ 0.44 శాతం నష్టపోయింది.
Gift nifty | ఆసియా మార్కెట్లు..
ఆసియా మార్కెట్లు శుక్రవారం ఉదయం ఎక్కువగా లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం 7.50 గంటల సమయంలో కోస్పీ(Kospi) 0.92 శాతం, షాంఘై 0.34 శాతం, స్ట్రెయిట్స్ టైమ్స్ 0.32 శాతం, హాంగ్‌సెంగ్ 0.31 శాతం, నిక్కీ 0.16 శాతం, లాభంతో ఉన్నాయి. తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.17 శాతం నష్టంతో కదలాడుతోంది. గిఫ్ట్ నిఫ్టీ 0.21 శాతం నష్టంతో ఉంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు గ్యాప్ డౌన్(Gap down)లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Gift nifty | గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్‌ఐఐ(FII)లు నికర కొనుగోలుదారులుగా మారారు. గత ట్రేడిరగ్ సెషన్‌లో నికరంగా రూ. 1,246 కోట్ల విలువైన స్టాక్స్ అమ్మారు. డీఐఐలు 33వ ట్రేడిరగ్ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా కొనసాగారు. నికరంగా రూ. 2,546 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 1.28 నుంచి 1.09 కు తగ్గింది. విక్స్(VIX) 3.5 శాతం తగ్గి 11.37 వద్ద ఉంది.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.23 శాతం పెరిగి 67.51 డాలర్ల వద్ద ఉంది.
డాలర్‌తో రూపాయి మారకం విలువ 18 పైసలు బలహీనపడి 87.26 వద్ద నిలిచింది.
యూఎస్ పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.33 శాతం వద్ద, డాలర్ ఇండెక్స్(Dollar index) 98.64 వద్ద కొనసాగుతున్నాయి. - ఉత్పత్తి రంగం పుంజుకోవడంతో ఆగస్టులో యూఎస్ వ్యాపార కార్యకలాపాలు ఊపందుకున్నాయి. తయారీ, సేవల రంగాలను ట్రాక్ చేసే ఎస్‌అండ్‌పీ గ్లోబల్ సంస్థ ఫ్లాష్ యూఎస్ కంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ ఈనెలలో 55.4 కు చేరింది. ఇది గత నెలలో 55.1గా ఉంది.
- జపాన్‌లో ఇన్ఫ్లేషన్ (Inflation) వరుసగా రెండో నెలలోనూ తగ్గింది. జూన్‌లో సీపీఐ 3.3 శాతం ఉండగా.. జూలైలో 3.1 శాతానికి తగ్గింది. అయితే ఆ దేశ కేంద్ర బ్యాంక్ నిర్దేశించిన 2 శాతానికిపైనే ఉండడం గమనార్హం.
- అమెరికాలో నిరుద్యోగ రేటు పెరుగుతోంది. నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తులు గతవారంలో 11 వేలు పెరిగాయి. ఆగస్టు 16తో ముగిసిన వారానికి 2.35 లక్షల దరఖాస్తులు రాగా.. అంతకుముందు వారంలో 2.25 లక్షలుగా ఉన్నాయి.