అక్షరటుడే, వెబ్డెస్క్: Chennai Airport : చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడింది. గురువారం (ఆగస్టు 21) ఒకేరోజు రెండు హైగ్రేడ్ గంజాయి పట్టుపడటం కలకలం రేపింది.
రెండు ఘటనల్లో కలిపి 11.8 కిలోల ప్రాసెస్డ్ హై గ్రేడ్ గంజాయి పట్టుబడింది. వీటి విలువ రూ. 12 కోట్ల వరకు ఉంటుందని ఎయిర్ పోర్ట్ పోలీసులు తెలిపారు.
Chennai Airport : స్నిఫర్ డాగ్స్ తనిఖీల్లో..
చెన్నె అంతర్జాతీయ విమానాశ్రయం(Chennai International Airport)లో స్నిఫర్ డాగ్స్ (sniffer dogs) తో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
ఈ క్రమంలో ఇద్దరు ప్రయాణికుల వద్ద 11.8 కిలోల ప్రాసెస్డ్ హై గ్రేడ్ గంజాయి (high-grade cannabis) పట్టుబడింది. ఈ మేరకు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
కాగా, గంజాయి గురించి తమకు తెలియదని, చెన్నెల్లో ఇవ్వమంటూ గుర్తుతెలియని వ్యక్తులు పార్సిల్ ఇచ్చారని ప్రయాణికులు చెబుతున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
స్మగ్లర్ల వెనుక ఎవరు ఉన్నారనే దానిపై విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.