అక్షరటుడే, హైదరాబాద్: Tollywood Movie shootings : ప్రొడ్యూసర్లు(producers), ఫిల్మ్ ఫెడరేషన్ మధ్య వివాదానికి తెర పడింది. తెలంగాణ ప్రభుత్వ(Telangana government) జోక్యంతో టాలీవుడ్ (Tollywood) వివాదం కొలిక్కి వచ్చింది. రేపటి (ఆగస్టు 22) నుంచి సినిమా షూటింగ్‌లు పునఃప్రారంభం కానున్నాయి.
లేబర్ కమిషనర్ (Labor Commissioner) వద్ద నిర్మాతలు, ఫెడరేషన్ (Film Federation) నాయకుల చర్చలు ముగిశాయి. ఈ మేరకు సినిమా ఇండస్ట్రీ (film industry) తరఫున తెలంగాణ ప్రభుత్వానికి దిల్‌రాజు (Dil Raju) ధన్యవాదాలు తెలిపారు.
సమస్యను త్వరగా పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారని ఈ సందర్బంగా దిల్‌రాజు గుర్తుచేశారు. సీఎం సూచన మేరకు సమస్య పరిష్కారం అయినందుకు సంతోషం వ్యక్తం చేశారు.
Tollywood Movie shootings : గత 18 రోజులుగా…
వేతనాల పెంపు డిమాండ్ చేస్తూ తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ (Film Employees Federation) సంచలన నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 4 నుంచి టాలీవుడ్ (Tollywood)లో షూటింగ్స్ బంద్ చేసింది. కార్మికులకు 30 శాతం వేతనాలు పెంచాలని ఫెడరేషన్ నేతలు డిమాండ్ చేశారు. వేతనాలు పెంచితేనే షూటింగ్లో పాల్గొంటామని స్పష్టం చేశారు.
వేతనాలు (Wages) పెండింగ్ లేకుండా రోజువారీగా ఇవ్వాలని కోరారు. 30 శాతం వేతనాలు పెంచి ఇస్తామని ప్రొడ్యూసర్స్ (Producer) లేఖ ఇస్తేనే.. సంబంధిత యూనియన్లకు తెలిపి విధులకు హాజరు కావాలని పేర్కొంది. ఫెడరేషన్‌లోని 24 కార్మిక సంఘాలు దీనిని పాటించాలని కోరింది. ఇతర భాషా సినిమాలు, వెబ్‌సిరీస్‌లకూ ఇది వర్తిస్తుందని తెలిపింది.
Tollywood Movie shootings : తెలంగాణ ప్రభుత్వం చొరవతో
ఈ మేరకు గత 18 రోజులుగా సినీ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. సినిమా షూటింగ్స్ ను బహిష్కరించారు. రోజుకో నిరసన కార్యక్రమం చేపట్టారు. చివరికి తెలంగాణ ప్రభుత్వం చొరవతో సమస్య పరిష్కారం అయింది. శుక్రవారం నుంచి సినిమా షూటింగ్స్ యథావిధిగా కొనసాగనున్నాయి.