అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad Honeytrap : తెలంగాణ రాజధాని హైదరాబాద్(Telangana capital Hyderabad)లో హనీట్రాప్ వెలుగుచూసింది. అమీర్పేట్(Ameerpet)లో 81 ఏళ్ల వృద్ధుడి నుంచి ఏకంగా రూ. 7 లక్షలు కాజేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
హోయలు పోయే గొంతుతో రొమాంటిక్ సంభాషణ, శృంగార సందేశాలతో ముగ్గులోకి దించి నిండా ముంచేసే హనీట్రాప్ వలలో యువకులే కాదు.. వృద్ధులు కూడా బలి అవుతున్నారు. తాజాగా హైదరాబాద్ అమీర్పేట్లో పండు ముసలిని సెక్సువల్ సంభాషణలతో నిండా ముంచేశారు కేటుగాళ్లు.
సైబర్ మోసగాళ్లు(Cyber fraudsters) మాయా రాజ్ పుత్ అనే మహిళ పేరుతో వృద్ధుడికి వల విసిరారు. మాటల్లో దించారు. రొమాంటిక్ సంభాషణతో ఆకట్టుకున్నారు. జూన్లో మొదలైన కిలాడీల వల విసరడం.. మెల్లిగా వృద్ధుడిని పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకున్నారు.
Hyderabad Honeytrap : కట్టు కథలు చెబుతూ..
ఇక ఆ తర్వాత వ్యక్తిగత సమస్యలంటూ మెల్లిగా డబ్బులు లాగడం మొదలెట్టారు. ఫ్లాట్ రిజిస్ట్రేషన్, ఆసుపత్రి ఖర్చులు, తాకట్టు పెట్టిన గోల్డ్ ఆర్నమెంట్స్ (gold ornaments) విడిపించాలంటూ.. కట్టు కథలు (fabricated stories) చెబుతూ.. వృద్ధుడిని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశారు.
Hyderabad Honeytrap : పదే పదే వేధిస్తుండటంతో..
ఇలా మొత్తంగా రూ. 7.11 లక్షల వరకు కాజేశారు. ఇంకా డబ్బులు కావాలని పదే పదే వేధిస్తుండటంతో వృద్ధుడికి అనుమానం వచ్చి తన కుటుంబీకులకు చెప్పేశాడు.
అలా పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. సైబర్ క్రైం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.