ePaper
More
    HomeతెలంగాణCaste Census | కుల గ‌ణ‌న‌ను స్వాగ‌తించిన కాంగ్రెస్‌.. తెలంగాణ మోడ‌ల్‌ను అనుస‌రించాల‌ని సూచ‌న‌

    Caste Census | కుల గ‌ణ‌న‌ను స్వాగ‌తించిన కాంగ్రెస్‌.. తెలంగాణ మోడ‌ల్‌ను అనుస‌రించాల‌ని సూచ‌న‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Caste Census | దేశ‌వ్యాప్తంగా కుల గ‌ణ‌న నిర్వ‌హించాల‌న్న కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని కాంగ్రెస్ పార్టీ(Congress Party) స్వాగతించింది. తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేప‌ట్టిన కుల గ‌ణ‌న మోడ‌ల్‌ను అనుస‌రించాల‌ని కేంద్రానికి సూచించింది. జన గ‌ణ‌న‌తో పాటు పాటు కుల గణన(Caste Census)ను కూడా నిర్వహిస్తామని కేంద్రం బుధ‌వారం చేసిన ప్రకటనను స్వాగతిస్తూ లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్వాగ‌తించారు. అదే స‌మ‌యంలో కుల గ‌ణ‌నకు ఏయే విధానాలు అవ‌లంభిస్తారో చెప్పాల‌ని, అలాగే, నిర్దిష్ట కాల ప‌రిమితిలోగా ప్ర‌క్రియ పూర్తి చేయాల‌ని కోరారు.

    Caste Census | తెలంగాణ మోడ‌ల్‌ను పరిశీలించండి..

    కుల గణన నిర్వహించడం అనేది ఒక ప్రాథమిక దశ మాత్రమేనని, దాని నుండి వెలువడే వివరాలు తదుపరి అభివృద్ధి కార్యకలాపాలకు వెన్నెముకగా నిలుస్తాయని రాహుల్‌గాంధీ అన్నారు. తెలంగాణ(Telangana) కుల గణన నమూనాను కేంద్రం అధ్యయనం చేయాలని, ఆ దిశగా ఆ ఆలోచనను అమలు చేయాలని సూచించారు. ప్రధాని మోదీ(Prime Minister Modi) చెప్పినట్లుగా నాలుగు విస్తృత కుల వర్గాలను గుర్తించే ఆలోచనకు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని, కానీ జనాభా గణన ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై దానిపై స్పష్టత ఇవ్వాలని రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు.

    Caste Census | సామాజిక న్యాయం కావాలి..

    కుల గణన నిర్వహిస్తామని, 50% రిజర్వేషన్(Reservation) పరిమితిని తొలగిస్తామని తాము పార్లమెంటులో చెప్పామ‌ని గుర్తు చేశారు. అందుకు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వ నిర్ణ‌యానికి పూర్తి మద్దతు ఇస్తున్నామని చెప్పారు. తెలంగాణ వంటి నమూనాలను ఉపయోగించి కుల గణనను రూపొందించడంలో సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని, కానీ ప్రభుత్వం(Government) ఒక నిర్దిష్ట కాల ప‌రిమితి గురించి చెప్పాల‌న్నారు. కేవలం కుల గణనను నిర్వహించి చేతులు దులుపుకుంటే స‌రిపోద‌ని, సామాజిక న్యాయం వైపు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రాహుల్‌గాంధీ అన్నారు.

    More like this

    Congress | కొత్త ఉప రాష్ట్ర‌ప‌తికి కాంగ్రెస్ అభినంద‌న‌.. నిష్పాక్షికంగా వ్య‌వ‌హరించాల‌ని విజ్ఞ‌ప్తి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Congress | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజ‌యం సాధించిన ఎన్డీయే అభ్య‌ర్థి సీపీ రాధాకృష్ణన్‌కు కాంగ్రెస్...

    Dichpally | బస్సుల కోసం విద్యార్థుల ఆందోళన

    అక్షరటుడే, డిచ్​పల్లి: Dichpally | పాఠశాల సమయాల్లో ఆర్టీసీ బస్సులు నడపాలని విద్యార్థులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు...

    Nepal Army | రంగంలోకి దిగిన నేపాల్ సైన్యం.. ఆందోళ‌న‌లు విర‌మించాల‌ని పిలుపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal Army | ర‌ణ‌రంగంగా మారిన నేపాల్‌లో ప‌రిస్థితుల‌ను అదుపులోకి తీసుకొచ్చేందుకు సైన్యం రంగంలోకి...