అక్షరటుడే, వెబ్‌డెస్క్: Engineering colleges | రాష్ట్రంలో ఇంజినీరింగ్ కాలేజీల (engineering colleges) ఫీజుల పెంపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి మూడేళ్లకు ఒకసారి ఫీజులు పెంచాలనే నిబంధన ఉంది. గతంలో 2022లో ఫీజులు పెంచారు. దీంతో ఈ ఏడాది ఫీజులు పెంచాలని పలు కాలేజీలు హైకోర్టును (High Court) ఆశ్రయించాయి. అయితే ప్రభుత్వం వద్దే తేల్చుకోవాలని కాలేజీలకు కోర్టు సూచించింది. అలాగే ఫీజుల పెంపునకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
హైకోర్టు ఆదేశాల మేరకు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజుల నిర్ధారణకు ప్రభుత్వం గత నెల 25న కమిటీ వేసింది. ఈ కమిటీ ఆయా కాలేజీల్లో పరిశీలన జరిపి నివేదిక ఇచ్చిన అనంతరం ఫీజులపై నిర్ణయం తీసుకోనుంది. అయితే తాజాగా ప్రభుత్వం (government) కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా కాలేజీలు అందించే అకౌంట్స్‌తో పాటు విద్యా ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని ఫీజులు పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు ఫీజుల పెంపు నిబంధనల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Engineering colleges | అన్ని అంశాలు పరిశీలించాకే..
రాష్ట్రంలో ప్రస్తుతం చాలా ఇంజినీరింగ్ కాలేజీల్లో కనీస సౌకర్యాలు లేవు. బోధన సిబ్బంది, ల్యాబ్‌లు లేకపోయినా పలు కాలేజీలు రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇంజినీరింగ్, వృత్తి విద్యా కాలేజీల్లో విద్యార్థుల హాజరు, ఫేషియల్ రికగ్నేషన్ అమలు, ఆధార్ ఆధారిత ఫీజుల చెల్లింపులు (Aadhaar-based fee payments) అంశాలను ప్రభుత్వం పరిశీలించనుంది. నాణ్యమైన విద్య (quality education) అందిస్తున్నారా.. చదువు అయిపోయాక ప్లేస్‌మెంట్స్ కల్పిస్తున్నారా అనే అంశాలను పరిగణనలోకి తీసుకొని ఫీజులు పెంచాలని సర్కార్ నిర్ణయించింది.
Engineering colleges | కమిటీ సభ్యులు వీరే..
తెలంగాణ ఉన్నత విద్యా మండలి (TGHEC) ఛైర్మన్ బాలకిష్టారెడ్డిని ఫీజుల నిర్ధారణ కమిటీ ఛైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. సాంకేతిక విద్య కమిషనర్ శ్రీదేవసేన (Technical Education Commissioner Sridevasena), ఏసీడీడీ కమిషన్, డైరెక్టర్ ఎన్ క్షితిజ, డీటీసీపీ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, టీజీసీహెచ్ఈ సెక్రెటరీ శ్రీరామ్ వెంకటేశ్, హైదరాబాద్ జేఎన్టీయూ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు, ఓయూ డీన్ క్రిష్ణయ్య ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. వీరు ఆయా కాలేజీల్లో తనిఖీలు చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.