అక్షర టుడే, వెబ్ డెస్క్: Nandipet mandal | నందిపేట్ మండలం (Nandipet mandal) నూత్ పల్లి శివారులో పేకాడుతున్న తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై శ్యామ్ రాజ్ తెలిపారు. గ్రామ శివారులో గురువారం సాయంత్రం పలువురు పేకాడుతున్నారన్న సమాచారం మేరకు సిబ్బందితో కలిసి పేకాట స్థావరంపై దాడి చేసినట్లు వెల్లడించారు.
దీంతో అక్కడ తొమ్మది మంది పేకాడుతూ పట్టుబడినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అలాగే వారి వద్ద నుంచి రూ. 39,100 నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే రాబోయే గణేష్ ఉత్సవాల (Ganesh festival) సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల సూచనలు, సలహాలు తీసుకుని ప్రజలు సహకరించాలని కోరారు.