అక్షర టుడే, ఇందల్వాయి: Indalwai | విద్యుదాఘాతంతో పంచాయతీ కార్మికుడికి గాయాలైన ఘటన మండలంలోని ఇందల్వాయి తండాలో (Indalwai Thanda) చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన పంచాయతీ కార్మికుడు ఎడపల్లి సాయిలు గురువారం వీధి దీపాలు సరి చేస్తున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురై తీవ్ర గాయాల పాలయ్యాడు. దీంతో స్థానికులు వెంటనే నిజామాబాద్‌కు తరలించగా, అక్కడి ప్రైవేట్ ఆస్పత్రిలో (private hospital) చికిత్స పొందుతున్నాడు. ప్రమాదంలో ఒక చేయిని పూర్తిగా తొలగించారు. పంచాయతీ కార్యదర్శి, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని, వారిపై చర్యలు తీసుకోవాలని బాధితుడి కుటుంబీకులు డిమాండ్ చేశారు.