అక్షరటుడే, భిక్కనూరు: Bhikanoor | భిక్కనూరులోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో (Vasavi Kanyaka Parameshwari Temple) నిర్వహించే ఉత్సవాలను జయప్రదం చేయాలని ఆర్యవైశ్య సంఘ సభ్యులు కోరారు. వేద మూర్తులు గంగవరం ఆంజనేయ శర్మ వైదిక మంత్ర నిర్వహణలో భిక్కనూరు ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్ర సభ్యుల ఆధ్వర్యంలో ఈ నెల 22న ఉత్సవాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఉదయం 9 గంటలకు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలు ఉంటాయన్నారు. అలాగే మహిళలు సామూహిక కుంకుమార్చన (Kumkumarchana), మంగళ నీరాజనం, మంత్రపుష్పం కార్యక్రమాలు ఉంటాయని, అనంతరం భక్తులకు అన్నదానం ఉంటుందన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.