అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | పంచాయతీరాజ్ (Panchayat Raj), గ్రామీణ అభివృద్ధి శాఖ (Rural Development Department) ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో ‘పనుల జాతర’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు.
గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు గ్రామపంచాయతీ, అంగన్వాడీ భవనాలు (Anganwadi buildings), పాఠశాలల ప్రహరీలు, సీసీ రోడ్డు నిర్మాణం తదితర పనులను చేపట్టినట్లు పేర్కొన్నారు. అలాగే షెడ్లు, పశువుల పాకలు, ఇంకుడు గుంతలు, కొత్తగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లకు (Indiramma Housing scheme) వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం తదితర పనులు కూడా చేపడుతున్నట్లు వివరించారు. కొత్తగా చేపట్టిన పనులకు శంకుస్థాపనలు, పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అన్ని గ్రామపంచాయతీల్లో కార్యక్రమాన్ని విధిగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సంబంధిత ప్రజాప్రతినిధులు పాల్గొనేలా వారికి ముందస్తు సమాచారం అందించాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారులను కోరారు.
Collector Nizamabad | మంజూరైన పనులివే..
72 జీపీ భవనాలకు రూ.14.40 కోట్లు, 483 సోక్ పీట్లకు రూ.4.34 కోట్లు, స్కూళ్లలో 121 మరుగుదొడ్లకు రూ.2.42కోట్లు, 300 ఉద్యానవనాలకు రూ. 3 కోట్లు, 77 అంగన్వాడీలకు రూ.9.2కోట్లు, 27 శానిటరీ కాంప్లెక్స్‌లకు రూ.8.1 కోట్లు, 468 పశువుల కొట్టాలకు రూ.4.6 కోట్లు, 21 కోళ్ల ఫారాలకు రూ.63 లక్షలు, 23 గొర్రెల షెడ్లకు రూ.23 లక్షలు మంజూరయ్యాయి.