అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Gol Hanuman Temple | నగరంలోని గోల్ హనుమాన్ ఆలయ నూతన పాలకవర్గం గురువారం ప్రమాణ స్వీకారం చేసింది. మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ (Shabbir ali) ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై నూతనంగా ఎన్నుకున్న పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు.
గోల్ హనుమాన్ ఆలయ నూతన పాలక మండలి ఛైర్మన్ బండారి నరేందర్, ఆలయ ధర్మకర్త తొడుపునూరి రామ్, మోహన్, గుండా సుధీర్, కరిపె లింగం, క్యాసారం విజయ్, ఉప్పరి స్వప్న, గంట జ్యోతి ప్రమాణ స్వీకారం చేశారు. దేవాదాయ ధర్మదాయ శాఖ ఆలయ అర్చకులు జయరాజ్ జోషి, జూనియర్ అసిస్టెంట్లు ఆంజనేయులు, గింజుపల్లి వేణు ప్రమాణస్వీకారం కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు.
కార్యక్రమంలో నుడా ఛైర్మన్ కేశ వేణు (Nuda Chairman Kesha Venu), ఉర్దూ అకాడమీ ఛైర్మన్ (Nuda Chairman Kesha Venu) తాహెర్ బిన్ హందాన్, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, శంభులింగేశ్వర ఆలయ కమిటీ ఛైర్మన్ బింగి మధు, విజయపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.