అక్షరటుడే, హైదరాబాద్ : IRTH Store | సినీ నటి శ్రియా(Actress Shriya) హైదరాబాద్‌లో సందడి చేసింది. కొండాపూర్‌లోని శరత్ సిటీ మాల్‌లో ఏర్పాటు చేసిన అర్థ్ ‘స్టోర్’ (IRTH Store)ను ప్రారంభించింది. ప్రముఖ టైటాన్ సంస్థ(Titan Company)కు చెందిన ప్రీమియం హ్యాండ్‌బ్యాగ్ బ్రాండ్ స్టోర్(Handbag Brand Store) ఇది. ఇందులో ఆకర్షణీయమైన ప్రీమియం హ్యాండ్‌బ్యాగ్‌లు లభ్యమవుతాయి.
అర్థ్ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోలో వర్క్ బ్యాగ్‌లు(Work Bags), టాల్ టోట్‌లు(Tall Totes), షోల్డర్ బ్యాగులు, హ్యాండ్‌హెల్డ్‌లు(Handhelds), స్లింగ్‌లు, క్రాస్-బాడీ బ్యాగులు, క్లచ్‌లు, వాలెట్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు డిలైట్స్, ఆర్గనైజర్స్ వంటి ప్రత్యేక విభాగాలు కూడా లభ్యమవుతాయి. అద్భుతమైన ఆఫర్‌లలో స్టైల్‌పై రాజీ పడకుండా ప్రీమియం మామ్ బ్యాగులు, హ్యాండ్‌బ్యాగ్ ఆర్గనైజర్‌లు ఉన్నాయి. స్టోర్‌లో క్రాఫ్టెడ్ ఇన్ ఇండియా లెదర్ ఎక్స్‌క్లూజివ్స్ కలెక్షన్స్ అందుబాటులో ఉన్నాయి.
“మా హైదరాబాద్(Hyderabad) స్టోర్ ప్రారంభంతో సౌత్ ఇండియాలో అర్థ్ కార్యకలాపాలను విస్తరించడానికి మేము సంతోషిస్తున్నాం” అని టైటాన్ కంపెనీ లిమిటెడ్, ఫ్రాగ్నాన్స్ & యాక్ససరీ డివిజన్ విభాగం సీఈవో మనీష్ గుప్తా అన్నారు. “హైదరాబాద్ వాసులు ఫ్యాషన్ అభిరుచితో లగ్జరీ, ప్రీమియం ఫ్యాషన్ బ్రాండ్‌లను అందుబాటులోకి తెచ్చాం’ ఈ బ్రాండ్ స్టోర్‌తో, హైదరాబాద్ మహిళలకు వారి రోజువారీ జీవనశైలికి తగినట్లుగా ప్రీమియం హ్యాండ్‌బ్యాగ్ బ్రాండ్‌ను అందించడానికి మేము సంతోషిస్తున్నాం” అని పేర్కొన్నారు. 2027 నాటికి భారతదేశం అంతటా 100 ప్రత్యేకమైన బ్రాండ్ స్టోర్‌లను ప్రారంభించాలనే అర్థ్ ప్రతిష్టాత్మక లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.