అక్షరటుడే నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | ఖలీల్వాడిలో (Khalilwadi) ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరిస్తున్నామని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. నగరంలో అన్ని శాఖల సమన్వయంతో సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (Indian Medical Association) ఆధ్వర్యంలో గురువారం సీపీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఖలీల్ వాడిలో ట్రాఫిక్ సమస్యను తగ్గించే విధంగా ప్రణాళికలు వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రధానంగా రాంగ్ పార్కింగ్ (Wrong parking), సెల్లార్ పార్కింగ్ తదితర విషయాలపై చర్చించారు. ఆస్పత్రులు, మెడికల్ షాప్‌లు, పార్కింగ్ స్థలాలు (parking Places), ఫుట్‌పాత్‌లు, ఎంక్రోచ్మెంట్లు (Encroachments), అంబులెన్స్‌ల గురించి వైద్యులు సూచనలు, సలహాలను సీపీ స్వీకరించారు. ప్రస్తుతం ఏర్పాటు చేయబోతున్న సెక్యూరిటీ కౌన్సిల్ భవిష్యత్తులో అన్నిరకాల సమస్యలపై తక్షణ పర్యవేక్షణ చేసి వాటి నివారణ కోసం జాగ్రత్తలు తీసుకుంటుందన్నారు.
CP Sai Chaitanya | రాజీవ్‌గాంధీ ఆడిటోరియంను..
భవిష్యత్తులో రాజీవ్ గాంధీ ఆడిటోరియం (Rajiv Gandhi Auditorium) పెయిడ్ పార్కింగ్ ఏరియాగా ఏర్పాటు చేస్తామని సీపీ పేర్కొన్నారు. 24 గంటలకు గాను.. కారుకు రూ.50, ఆటోకు రూ.30, బైక్‌కు రూ.20 ఛార్జీ చేయనున్నట్లు వివరించారు. ఈ అవకాశాన్ని ఆస్పత్రుల నిర్వాహకులు పేషెంట్ల కోసం వచ్చేవారికి సూచించాలని స్పష్టం చేశారు.
ప్రతి ఒక్కరూ ప్రభుత్వ మెడికల్ గైడ్‌లెన్స్‌ను (Medical guidelines) తూ.చా తప్పకుండా పాటించాలని సీపీ పేర్కొన్నారు. నిబంధనలు పాటించని వారిపై ప్రభుత్వపరంగా జరిమానాలు, లైసెన్స్‌లను రద్దు చేస్తామని వివరించారు. కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) బస్వారెడ్డి, డీఎంహెచ్‌వో రాజశ్రీ, అదనపు మున్సిపల్ కమిషనర్ రవి, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు అజ్జ శ్రీనివాస్, నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
సీపీతో సమావేశంలో పాల్గొన్న ఖలీల్‌వాడి ఆస్పత్రుల నిర్వాహకులు