అక్షరటుడే, వెబ్‌డెస్క్ : BCCI | సీనియర్ ఆటగాళ్లు తప్పుకోవడంతో బీసీసీఐ సరికొత్త ప్లాన్స్ వేస్తుంది. రోహిత్ ఇప్పటికే టీ20, టెస్ట్‌ల నుండి రిటైర్మెంట్ ప్రకటించడంతో సూర్య కుమార్ యాదవ్‌ని టీ20 కెప్టెన్‌గా, శుభ్‌మన్ గిల్‌ని టెస్ట్ కెప్టెన్‌గా నియమించారు. వన్డేలకు ప్రస్తుతం రోహిత్ శర్మనే కెప్టెన్‌గా ఉన్నారు. ఆయన తర్వాతి వారసుడు ఎవరనే చర్చ ఇప్పుడు మొదలైంది. తాజా సమాచారం ప్రకారం.. శ్రేయాస్ అయ్యర్‌ను (Shreyas Iyer) వన్డే ఫార్మాట్‌కు టీమిండియా కెప్టెన్‌గా ఎంపిక చేయాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలిసింది. అత్యంత సమర్థవంతమైన మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా పేరు తెచ్చుకున్న శ్రేయాస్, గత కొంతకాలంగా గాయాల కారణంగా జట్టులో నిలకడగా ఉండలేకపోయాడు.
BCCI | కొత్త నాయకుడు..
అయితే ప్రస్తుతం అతను పూర్తిగా ఫిట్‌గా ఉండగా, బీసీసీఐ భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేస్తోందట. 2027 వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని, శ్రేయాస్‌కు ODI కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీసీఐ (BCCI) తాజా వ్యూహం ప్రకారం.. మూడు ఫార్మాట్లకు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లు ఉండే అవకాశముంది. ఇప్పటివరకు టీ20లకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తుండగా, టెస్టులకు శుభ్‌మాన్ గిల్‌ను (Shubhman Gill) నాయకుడిగా ఉన్నాడు. మరి కొద్ది రోజులలో జరగనున్న ఆసియా కప్ టోర్నమెంట్‌కు గాను గిల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయడం కూడా మనం చూశాం. ఇవన్నీ బీసీసీఐ ప్లాన్స్ లో భాగం అని అంటున్నారు.
ఆసియా కప్ అనంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో సమావేశం జరగనుండగా, వీరిద్దరూ ఆ మీటింగ్ తర్వాత వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన ఆశ్చర్యపోవలసిన అవసరం లేదని వర్గాలు చెబుతున్నాయి. వారి నిర్ణయాన్ని బట్టి కొత్త నాయకత్వ నిర్మాణం బలపడనుంది. ఇదే నేపథ్యంలో శ్రేయాస్ అయ్యర్‌కి వన్డే లీడర్‌గా అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే “సర్పంచ్ సాహెబ్ (Sarpanch Saheb) అనే ట్యాగ్‌తో గుర్తింపు పొందిన శ్రేయాస్, తన స్పష్టమైన ఆలోచనలు, మైదానంలో కూల్ యాటిట్యూడ్‌తో కెప్టెన్సీకి సరైన ఎంపికగా నిలుస్తాడన్నది క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం. భారత జట్టు వచ్చే నెల ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో, అక్కడికి వెళ్లే ముందు ఈ కీలక నాయకత్వ మార్పులు జరగే అవకాశముంది.