అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు (Domestic stock markets) లాభాల బాటలో పయనిస్తున్నాయి. వరుసగా ఆరో సెషన్‌లోనూ లాభాలతో ముగిశాయి. గురువారం ఉదయం సెన్సెక్స్ (Sensex) 363 పాయింట్ల గ్యాప్‌అప్‌లో ప్రారంభమైంది.
ఆ తర్వాత 299 పాయింట్లు తగ్గినా మళ్లీ కోలుకుని 310 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ (Nifty) 92 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా వెంటనే 88 పాయింట్లు కోల్పోయింది. అక్కడినుంచి కోలుకుని 99 పాయింట్లు పైకి ఎగబాకింది. చివరికి సెన్సెక్స్ 142 పాయింట్ల లాభంతో 82 వేల వద్ద, నిఫ్టీ 33 పాయింట్ల లాభంతో 25,083 వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీలో సిప్లా, డాక్టర్ రెడ్డీస్, ఐసీఐసీఐ బ్యాంక్(ICICI bank), బజాజ్ ఫిన్‌సర్వ్, ఎస్‌బీఐ లైఫ్, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ వంటి షేర్లు లాభపడ్డాయి. వరుసగా ఆరోరోజూ ప్రధాన సూచీలు లాభాల బాటలో సాగినా.. చివరలో కాస్త లాభాల స్వీకరణ కనిపించింది. వాణిజ్య ఒప్పందాల విషయంలో ట్రంప్ విధించిన గడువు సమీపిస్తుండడం, గ్లోబల్ మార్కెట్లలో వీక్‌నెస్ ప్రభావం మన మార్కెట్లపై కనిపించింది.
Stock Market | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్‌ఈలో నమోదైన కంపెనీలలో 2,094 కంపెనీలు లాభపడగా 2 వేల స్టాక్స్ నష్టపోయాయి. 154 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 143 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 49 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 8 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 8 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
Stock Market | స్మాల్, మిడ్ క్యాప్ స్టాక్స్‌పై ఒత్తిడి..
మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో ర్యాలీకి అడ్డుకట్ట పడిరది. ఎఫ్‌ఎంసీజీ(FMCG), పీఎస్‌యూ స్టాక్స్‌లో బలహీనత కొనసాగుతోంది. బీఎస్‌ఈలో పవర్ ఇండెక్స్ 0.94 శాతం పడిపోయింది. యుటిలిటీ 0.63 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.53 శాతం, ఇన్‌ఫ్రా 0.48 శాతం, పీఎస్‌యూ 0.43 శాతం, ఆటో 0.41 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 0.37 శాతం నష్టపోయాయి. రియాలిటీ(Realty) ఇండెక్స్ మాత్రమే మోస్తరుగా రాణించి 0.46 శాతం లాభాలతో ముగిసింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.12 శాతం పడిపోగా.. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.01 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.08 శాతం లాభపడ్డాయి.
Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 14 కంపెనీలు లాభాలతో, 16 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. బజాజ్ ఫిన్‌సర్వ్ 1.12 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.09 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.90 శాతం, రిలయన్స్ 0.86 శాతం, ఎల్‌టీ 0.76 శాతం లాభాలతో ముగిశాయి.
Top Losers : పవర్‌గ్రిడ్ 1.51 శాతం, ఎటర్నల్ 1.47 శాతం, హెచ్‌యూఎల్ 1.08 శాతం, అదానిపోర్ట్స్ 0.95 శాతం, ఎన్టీపీసీ 0.91 శాతం నష్టపోయాయి.