అక్షరటుడే, వెబ్డెస్క్ : Himachal Pradesh | దేశవ్యాప్తంగా కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, నదులు ఉధృతంగా పారుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతంలో భారీ వర్షాలు(Heavy Rains) పడుతుండడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఓ వాగులో నీటికి బదులు పాలు ప్రవహించడంతో ప్రజలు ఆశ్చర్యపోయారు.
హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh)లోని కులులో ఓ వాగులో పాలు ప్రవహించాయి. నీటికి బదులు పాలు వాగులో పారుతుండడంతో స్థానికులు ఇదేమి వింత అనుకున్నారు. అయితే స్థానికంగా ఉన్న పాల శీతలీకరణ కేంద్రంలో కరెంట్ సరఫరా(Current supply) లేకపోవడంతో పాలు పాడయిపోయాయి. దీంతో నిర్వాహకులు దాదాపు 2000 లీటర్ల పాలను (2000 Liters Milk) వాగులో పారబోశారు. ఒక్కసారిగా భారీ మొత్తంలో పాలు పోయడంతో వాగులో నీరు పాల రంగులోకి మారిపోయాయి.
Himachal Pradesh | రూ.లక్ష నష్టం
ఎలక్ట్రీషియన్ ఆలస్యంగా రావడంతో విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేకపోయారు. దీంతో పాలు పుల్లగా మారడంతో వాగులో పారబోశారు. దాదాపు రూ.లక్ష విలువైన పాలను పారబోశారు. రెండు వేల లీటర్లు వాగులో పోయడంతో నీటికి బదులు పాలు పారుతున్నట్లు కనిపించింది. ఇదేమి వింత అని ప్రజలు మొదట ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు విషయం తెలియడంతో ఆశ్చర్యపోయారు.