ePaper
More
    HomeసినిమాSamantha | సినిమాలు త‌గ్గించ‌డానికి కార‌ణం చెప్పిన స‌మంత‌.. క్వాలిటీనే ముఖ్య‌మంటున్న ముద్దుగుమ్మ‌

    Samantha | సినిమాలు త‌గ్గించ‌డానికి కార‌ణం చెప్పిన స‌మంత‌.. క్వాలిటీనే ముఖ్య‌మంటున్న ముద్దుగుమ్మ‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Samantha | నటిగా మాత్రమే కాకుండా, నిర్మాతగా కూడా గుర్తింపు తెచ్చుకున్న న‌టి సమంత రూత్ ప్రభు. ఒక‌ప్పుడు వ‌రుస సినిమాలతో సంద‌డి చేసిన సమంత (Samantha) ఈ మ‌ధ్య సినిమాల సంఖ్య కాస్త త‌గ్గించింది.

    రీసెంట్‌గా ప్రముఖ లైఫ్ స్టైల్‌ మ్యాగజైన్ గ్రాజియా ఇండియా (Lifestyle magazine Grazia India) తాజా ఎడిషన్ కవర్‌పేజీపై ఆకర్షణీయ లుక్‌తో మెరిసిపోయారు స‌మంత‌. ఈ సందర్భంగా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్, వ్యక్తిగత జీవితం, ఆరోగ్యంపై దృష్టి తదితర విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంతో పోలిస్తే తన ఆలోచనల్లో, జీవనశైలిలో స్పష్టమైన మార్పులు వచ్చాయని ఆమె పేర్కొంది. ప్రస్తుతం ఫిట్‌నెస్, మానసిక ఆరోగ్యం, సినిమాలు అన్నింటికీ సమ ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పుకొచ్చింది.

    ఇప్పటివరకు చేసిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు (Web Series) అన్నీ తన మనసుకు దగ్గరగా ఉన్నవేనని స్పష్టం చేశారు. “ఒకప్పుడు ఒకేసారి ఐదు సినిమాలు ఒప్పుకున్న రోజులూ ఉన్నాయి. కానీ ఇప్పుడు తాను శారీరక, మానసిక స్థితిని బట్టి సినిమాలు ఎంచుకుంటానని, తక్కువ సినిమాలు చేసినా, వాటి నాణ్యతపై అధికంగా దృష్టి పెడతానని చెప్పారు. ఎన్నిక కాదు, నాణ్యతే ముఖ్యం. ప్రతి సినిమా ప్రేక్షకులను మెప్పించాలి అనేదే నా లక్ష్యం” అంటూ ఆమె చెప్పుకొచ్చారు.

    సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సమంత, అక్కడ ప్రశంసలకంటే విమర్శలు ఎక్కువగా ఎదురయ్యే అవకాశం ఉంటుందంటూ చెప్పుకొచ్చారు. ట్రోలింగ్ వస్తే పట్టించుకోకుండా, దూరంగా ఉండాలి. అది మనపై ప్రభావం చూపనివ్వకూడదు. అదే సమయంలో సోషల్ మీడియాలో (Social Media) నిజాయితీగా ఉండాలని చూసే వ్యక్తిని నేను అని చెప్పుకొచ్చింది స‌మంత‌. ఇక ప్రస్తుతం దర్శకులు రాజ్ & డీకే తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రక్త బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్’లో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు సామ్‌. ఈ పీరియాడిక్ డ్రామాలో ఆమెతో పాటు ఆదిత్య రాయ్ కపూర్, అలీ ఫజల్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

    Latest articles

    ACB Case | ఇందిరమ్మ ఇళ్ల కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Case | రాష్ట్రంలో పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల...

    SP Rajesh Chandra | మొబైల్‌ ఫోరెన్సిక్‌ వాహనాన్ని ప్రారంభించిన ఎస్పీ

    అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | జిల్లాలో ఫోరెన్సిక్‌ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తూ తెలంగాణ రాష్ట్ర...

    Gol Hanuman Temple | గోల్​​ హనుమాన్ ఆలయ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Gol Hanuman Temple | నగరంలోని గోల్​ హనుమాన్​ ఆలయ నూతన పాలకవర్గం గురువారం...

    IRTH Store | హైదరాబాద్‌లో సందడి చేసిన శ్రియా.. ‘అర్థ్’ స్టోర్​ను ప్రారంభించిన నటి..

    అక్షరటుడే, హైదరాబాద్ : IRTH Store | సినీ నటి శ్రియా(Actress Shriya) హైదరాబాద్​లో సందడి చేసింది. కొండాపూర్‌లోని...

    More like this