అక్షరటుడే, ఇందూరు: Satya Saibaba | సత్యసాయి బాబా శత వార్షిక జయంతిలో (Sathya Sai Baba jayanthi) భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 306 గ్రామాల్లో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు గురువారం సత్యసాయి సేవాసంస్థ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ ప్రకటన విడుదల చేశారు.
ఇందులో భాగంగా జిల్లాలో ఈనెల 23, 24వ తేదీల్లో నిజామాబాద్ సమితిలోని (Nizamabad) మల్కాపూర్, జానకంపేటలో (janakampet) ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆర్మూర్ (Armoor) మండలంలోని ఇస్సాపల్లి, అంకాపూర్ (ankapur), దోన్కల్ సమితిలోని వెంకటాపూర్, వేల్పూర్, మోర్తాడ్ సమితిలోని దొంపాల్, రామన్నపేట ఉత్సవాలు జరుగుతాయని వెల్లడించారు. అలాగే బోధన్ (Bodhan) సమితిలోని వర్ని, అంబం, ధర్పల్లిలోని సీతయ్యపేట్, హొన్నాజీపేట్, చౌటుపల్లి రేకులపల్లిలో గ్రామోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
Satya Saibaba | బాలబాలికలకు ఆటలపోటీలు..
గ్రామోత్సవం (Gramotsavam) కార్యక్రమంలో భాగంగా బాలబాలికలకు ఆటపాటల పోటీలు, మహిళలకు ముగ్గుల పోటీ, పాటల పోటీ, ఆధ్యాత్మిక విషయాలపై క్విజ్, యువతకు పలు అంశాలపై పోటీలు, గ్రామీణులకు సేవ చేసే ఆశ, అంగన్వాడీ, పాఠశాల, గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మాన కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు.