అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad City | చదువుపై అనాసక్తితో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నగరంలోని నాల్గో టౌన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
నగరంలోని రోటరీనగర్‌లో (Rotary Nagar) నివాసముండే శ్రీనివాస్‌కు ఒక కూతురు, ఒక కొడుకు రాజేశ్వర్ ఉన్నారు. రాజేశ్వర్ ప్రస్తుతం పదో తరగతి ఫెయిల్ అయినప్పటికీ సప్లిమెంటరీ పరీక్షలు రాసి తిరిగి పాసయ్యాడు. అనంతరం ఇంటర్లో జాయిన్ కావాలని తల్లిదండ్రులు చెప్పినప్పటికీ రాజేశ్వర్ వినలేదు.
చదువుకుంటే ఉన్నతస్థానానికి వెళ్లవచ్చని.. సమాజంలో మంచిపేరు వస్తుందని తల్లిదండ్రులు రాజేశ్వర్‌కు నిత్యం చెబుతుండేవారు.
కానీ రాజేశ్వర్‌కు మాత్రం చదువుపై ఏమాత్రం ఆసక్తి లేకుండాపోయింది. చివరికి చదువుపై అనాసక్తితో గురువారం ఉదయం ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న నాల్గో టౌన్ పోలీసులు (Fourth Town Police) ఘటనా స్థలానికి చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.