ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Godavari | గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద 51 అడుగులకు చేరిన నీటి మట్టం

    Godavari | గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద 51 అడుగులకు చేరిన నీటి మట్టం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Godavari | వారం రోజులుగా రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్​గఢ్​లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరికి వరద పోటెత్తింది. గోదావరి ఉపనదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో భద్రాచలం వద్ద గోదావరి (Godavari) నది ఉప్పొంగి ప్రవహిస్తుంది.

    భద్రాచలంలో (Bhadrachalam) గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బుధవారం రాత్రి గోదావరి నీటి మట్టం 48 అడుగులు కాగా.. గురువారం ఉదయానికి 51 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. నీటిమట్టం 53 అడుగులకు చేరితో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు.

    Godavari | నిలిచిపోయిన రాకపోకలు

    వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్ట్​లు అన్ని నిండుకుండలా మారాయి. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో గోదావరి ఉధృతంగా పారుతోంది. వరద పోటెత్తడంతో పలు మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భద్రాచలం వద్ద కల్యాణ కట్ట (Kalyana Katta) వరకు నీరు చేరింది. వరద నీరు పట్టణంలోకి రాకుండా అధికారులు గోదావరి కరకట్టకు ఉన్న స్లూయిజ్‌లను మూసివేశారు. ఎగువ నుంచి వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

    Godavari | ధవళేశ్వరం వద్ద..

    గోదావరి వరద పోటెత్తడంతో ధవళేశ్వరం(Dhavaleswaram) వద్ద పది లక్షల క్యూసెక్కుల ఇన్​ఫ్లో నమోదు అవుతోంది. ఆనకట్ట వద్ద 11.75 అడుగులకు నీటిమట్టం చేరింది. దీంతో అధికారులు 175 గేట్లను 10 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ప్రాజెక్ట్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. రాజమండ్రి పరిసర లంకల్లో నివసిస్తున్న 300 మంది మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లంక గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

    Latest articles

    Earth Store | హైదరాబాద్‌లో సందడి చేసిన శ్రియా.. ‘అర్థ్’ స్టోర్​ను ప్రారంభించిన నటి..

    అక్షరటుడే, హైదరాబాద్ : Earth Store | సినీ నటి శ్రియా(Actress Shriya) హైదరాబాద్​లో సందడి చేసింది. కొండాపూర్‌లోని...

    CP Sai Chaitanya | పెయిడ్​ పార్కింగ్​ ఏరియా రాజీవ్​గాంధీ ఆడిటోరియం: సీపీ

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | ఖలీల్​వాడిలో (Khalilwadi) ట్రాఫిక్​ రద్దీని క్రమబద్ధీకరిస్తున్నామని సీపీ సాయిచైతన్య...

    SP Rajesh Chandra | మహిళకు ఉరి కేసులో ఒకరి అరెస్ట్

    అక్షరటుడే, కామారెడ్డి : SP Rajesh Chandra | మహిళను చీర కొంగుతో ఉరివేసి హత్య చేసిన నిందితుడిని...

    BHEL Notifications | బీహెచ్‌ఈఎల్‌లో ఇంజినీర్‌, సూపర్‌ వైజర్‌ పోస్టులు.. ఈనెల 28తో ముగియనున్న దరఖాస్తు గడువు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BHEL Notifications | భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌(BHEL) మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ విభాగాలలో...

    More like this