అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad | హైదరాబాద్ నగరంలోని (Hyderabad city) మియాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. దీంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.
కర్నాటకలోని (Karnataka) గుల్బర్గాకు చెందిన లక్ష్మయ్య (60), వెంకటమ్మ (55) దంపతులు. వీరికి అల్లుడు అనిల్ (40), కుమార్తె కవిత (38) ఉన్నారు. అనిల్, కవితకు రెండేళ్ల కూతురు ఉంది. వీరు కొంత కాలంగా మియాపూర్‌లోని మక్తా మహబూబ్‌పేటలో నివాసం ఉంటున్నారు. బుధవారం అర్ధరాత్రి వీరు మృతి చెందారు. గురువారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Hyderabad | ఆత్మహత్యగా అనుమానం
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందిన విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. వీరంతా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ముందు చిన్నారిని హత్య చేసి మిగతా నలుగురు విషం తీసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు (Case registered) చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.