అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | జిల్లాలో వాహనాల తనిఖీలను కట్టుదిట్టం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ఎట్టి పరిస్థితుల్లో సీపీ ఉపేక్షించడం లేదు. నిజామాబాద్ కమిషనరేట్(Nizamabad Commissionerate) పరిధిలో నిత్యం ఏదో ఒక చోట తనిఖీలు చేస్తున్నారు. తాగి కార్లు, బైక్లు, భారీ వాహనాలు నడుపుతున్నట్లు రుజువైతే వారిపై పక్కాగా కేసులు నమోదు చేస్తున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరుస్తున్నారు.
CP Sai Chaitanya | జిల్లాలో ఒక్కనెలలోనే 1,708 కేసులు నమోదు..
జిల్లాలో గత జూలైలో ఏకంగా 17,08 కేసులు నమోదు చేసినట్లు సీపీ సాయిచైతన్య(CP Sai Chaitanya) తెలిపారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. అందులో 966 కేసుల్లో నేరం రుజువైనందుకు 77మందిని న్యాయస్థానం జైలుకు పంపింది. నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో మునుపెన్నడూ లేని విధంగా ట్రాఫిక్ పోలీసులు(Traffic Police) తనిఖీలు చేస్తూ కేసు నమోదు చేస్తున్నారు. అలాగే ప్రతి ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద పోలీసులు తనిఖీ చేస్తూ వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు.
CP Sai Chaitanya | ఆర్టీఏ ఆధ్వర్యంలో..
కమిషనరేట్ పరిధిలో పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ వాహనాలపై ఆర్టీఏ అధికారులు(RTA Officers) కూడా చర్యలు చేపట్టారు. పోలీసులు కేసులు నమోదు చేసిన అనంతరం ఆర్టీఏ అధికారులు జూలైలో మొత్తం 62 డ్రైవింగ్ లైసెన్స్(Driving License)లను సస్పెండ్ చేశారు.