అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vinod Kambli : టీమిండియా Team India మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లి (Vinod Kambli) ఆరోగ్య పరిస్థితి ఇంకా పూర్తిగా మెరుగవలేదని, ఆయన తమ్ముడు వీరేంద్ర కాంబ్లి (Virendra Kambli) తాజా ఇంటర్వ్యూలో తెలిపారు.
గత ఏడాది అక్టోబరులో వినోద్ తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు. మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్‌తో పాటు మెదడులో రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స అనంతరం కొంత మేరకు కోలుకున్నప్పటికీ, పూర్తి ఆరోగ్యానికి ఇంకా కాలం పడుతుందని తెలుస్తోంది.
Vinod Kambli | సొంతింట్లోనే..
వీరేంద్ర కాంబ్లి తెలిపిన వివరాల ప్రకారం.. వినోద్ కాంబ్లి ప్రస్తుతం ముంబయిలోని బాంద్రాలో తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. మాట్లాడడం.. నడవడంవంటి సాధారణ కార్యకలాపాలు కూడా ఆయనకు కష్టం అవుతున్నాయి. ఇప్పటికీ ఫిజియోథెరపీ, ఇతర చికిత్సలు కొనసాగుతున్నాయి. మాటలు స్పష్టంగా రావడం లేదని, ఆ విషయంలో అభిమానులు నిజంగా బాధపడుతున్నారని వీరేంద్ర అన్నారు.
వినోద్ కాంబ్లి 10 రోజుల పాటు పునరావాస చికిత్స పొందారు. మెదడు స్కాన్, మూత్రపరీక్షలతో పాటు మొత్తం ఆరోగ్య పరీక్షలు నిర్వహించారని, ఎటువంటి పెద్ద సమస్య తేలలేదని వెల్లడించారు వినోద్ సోదరుడు.
అయితే, నడవలేకపోతున్నారు కాబట్టి ఆయన కోలుకునేందుకు ఫిజియోథెరపీ Physiotherapy అందిస్తున్నారు. ఆరోగ్యం (Health) మెరుగవుతున్నప్పటికీ, సాధారణ స్థితికి రావాలంటే ఇంకా సమయం అవసరమని ఆయన చెప్పారు.
Vinod Kambli : మీ ప్రేమ, మద్దతు అతనికి అవసరం..
“వినోద్ అన్న త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి. అతను ఒక ఛాంపియన్ (Champion) తిరిగి వస్తారు. త్వరలో తిరిగి నడవడం, ఆరోగ్యంగా ఉండడం మొదలుపెడతాడని నమ్ముతున్నాను. మీ ప్రేమ, మద్దతు అతనికి అవసరం” అని వీరేంద్ర కాంబ్లి భావోద్వేగంగా కామెంట్ చేశారు.
ఇక కాంబ్లి కుటుంబం విషయానికి వస్తే వారు మొత్తం నలుగురు సోదరులు ఉన్నారు. వారి పేర్లు వినోద్, వీరేంద్ర, వికాస్, విద్యాధర్. వీరేంద్ర కూడా చిన్ననాటి నుంచి క్రికెట్‌ను ప్రేమించాడు కానీ, అతని కెరియర్ ఆశించినంతగా ముందుకు సాగలేదు.