అక్షరటుడే, వెబ్‌డెస్క్: Gold price on august 21 | బంగారం కొనాలనుకున్న వారు ఇది శుభవార్త. గత కొద్ది రోజులుగా పసడి ధరలు క్రమేపి తగ్గుకుంటూ వస్తున్నాయి. ఈ సమయంలో బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకున్నవారు, కొనుగోలు చేయాలని అనుకునేవారు ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు.
ఆగస్టు 21న బంగారం ధరలు (Gold Price) కొద్దిగా పెరిగి, గరిష్ట స్థాయికి దగ్గరగా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం Gold ధర రూ.1,00,140గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్‌ల 10 గ్రాముల బంగారం ధర రూ. 91,790గా నమోదైంది.
ఇక కిలో వెండి ధర రూ.1,14,900గా ట్రేడ్ అయింది. 10 గ్రాముల ప్లాటినం ధర కూడా స్వల్పంగా తగ్గి రూ.37,22గా ట్రేడ్ అయింది.
Gold price on august 21 | తగ్గుదల..
గతేడాది ఇదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 70,000 – 80,000 మధ్యలో ఉండగా, ప్రస్తుతం అది లక్ష రూపాయల మార్క్ దాటి దూసుకుపోతోంది.
దేశంలోని ఇతర ప్రధాన నగరాలలో బంగారం ధరలు చూస్తే ( 24 కారెట్లు, 22 కారెట్లు, 18 కారెట్లు) చూస్తే..
- చెన్నై: రూ. 1,00,140 – రూ. 91,790 – రూ. 75,890
- ముంబయి: రూ. 1,00,140 – రూ. 91,790 – రూ. 75,100
- ఢిల్లీ: రూ. 1,00,290 – రూ. 91,940 – రూ. 75,230
- కోల్‌కతా: రూ. 1,00,140 – రూ. 91,790 – రూ. 75,100
- బెంగళూరు: రూ. 1,00,140 – రూ. 91,790 – రూ. 75,100
- హైదరాబాద్ Hyderabad: రూ. 1,00,140 – రూ. 91,790 – రూ. 75,100
- కేరళ: రూ. 1,00,140 – రూ. 91,790 – రూ. 75,100
- పుణె: రూ. 1,00,140 – రూ. 91,790 – రూ. 75,100
- వడోదరా: రూ. 1,00,190 – రూ. 91,840 – రూ. 75,140
- అహ్మదాబాద్: రూ. 1,00,190 – రూ. 91,840 – రూ. 75,140 గా ట్రేడ్ అయింది.
Gold price on august 21 | ఇతర నగరాల్లో వెండి (కిలో) ధరలు చూస్తే..
- చెన్నై: రూ. 1,24,900
- ముంబయి: రూ. 1,14,900
- ఢిల్లీ: రూ. 1,14,900
- కోల్‌కతా: రూ. 1,14,900
- బెంగళూరు: రూ. 1,14,900
- హైదరాబాద్: రూ. 1,24,900
- కేరళ: రూ. 1,24,900
- పుణె: రూ. 1,14,900
- వడోదరా: రూ. 1,14,900
- అహ్మదాబాద్: రూ. 1,14,900 గా ట్రేడ్ అయింది.
పసిడి ధరలు మొన్నటి వరకు భారీగా పెరిగిన నేపథ్యంలో పసిడి ఆభరణాలు (gold jewellery) కొనుగోలు చేసే వారికి ఇది చాలా ఇబ్బందికరంగా మారింది. ఇటీవల క్రమంగా ధరలు (Gold Prices) తగ్గుతున్న నేపథ్యంలో కొనుగోలు దారులు ఆసక్తి చూపుతున్నారు.