ePaper
More
    HomeతెలంగాణIndiramma Illu | ఇందిరమ్మ ఇళ్ల కోసం లంచం డిమాండ్​ చేసిన ఏఈ.. ఆడియో వైరల్​

    Indiramma Illu | ఇందిరమ్మ ఇళ్ల కోసం లంచం డిమాండ్​ చేసిన ఏఈ.. ఆడియో వైరల్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indiramma Illu | పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు కాంగ్రెస్​ ప్రభుత్వం (Congress Govt) ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక పూర్తవగా ఇళ్ల నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. అయితే కొంతమంది అధికారులు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుంచి డబ్బులు డిమాండ్​ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

    సూర్యాపేట జిల్లా హుజుర్​నగర్ (Huzur Nagar)​లో పంచాయతీ కార్యదర్శి బిల్లుల చెల్లింపు కోసం లబ్ధిదారుల నుంచి డబ్బులు డిమాండ్​ చేశారు. ఈ విషయం మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి వరకు వెళ్లడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సదరు కార్యదర్శిని కలెక్టర్​ సస్పెండ్ చేశారు. తాజాగా సిద్దిపేట (Siddipet) రూరల్​ మండలం వెంకటాపూర్​కు చెందిన మేస్త్రీని హౌసింగ్​ ఏఈ వెంకన్న ఫోన్​ చేసి డబ్బులు డిమాండ్​ చేశాడు.

    Indiramma Illu | ఇంటికి రూ.5 వేలు ఇవ్వాలని..

    గ్రామానికి చెందిన వెంకటయ్య మేస్త్రీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. గ్రామంలో దాదాపు 18 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆయన కాంట్రాక్ట్​ పట్టుకున్నాడు. దీంతో ఏఈ వెంకన్న ఆయనకు ఫోన్​ చేసి ఇంటికి రూ.5 వేల చొప్పున తనకు చెల్లించాలని డిమాండ్​ చేసినట్లు బాధితుడు ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆడియో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. ఒక వేళ డబ్బులు ఇవ్వకపోతే బిల్లులు మంజూరు చేయనని, ఇతర ఇల్లులు పట్టుకోకుండా చేస్తానని ఏఈ బెదిరించాడని బాధితుడు వాపోయాడు. కాగా ఈ విషయం తమ దృష్టికి రాలేదని జెడ్పీ సీఈవో రమేశ్​ తెలిపారు. ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

    Latest articles

    Vice-Presidential elections | రసవత్తంగా రెండో అత్యున్నత రాజ్యాంగ పదవి ఎన్నిక.. అసలు ఏమిటీ ఉపరాష్ట్రపతి పదవి..?

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice-Presidential elections : భారత్​లో ఉపరాష్ట్రపతి ఎన్నికలు రసవత్తంగా మారాయి. ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్‌ఖడ్ తన...

    Operation Sindoor lessons | ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో ఆపరేషన్‌ సిందూర్‌ పాఠాలు

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Operation Sindoor lessons : ఆపరేషన్​ సిందూర్​.. పహల్గావ్​ ఉగ్రదాడి (Pahalgaon terror attack) తర్వాత...

    Municipal Commissioners Transfer | మున్సిపల్​ కమిషనర్​ల బదిలీ.. నిజామాబాద్​కు​ యాదగిరి రావు

    అక్షరటుడే, హైదరాబాద్: Municipal Commissioners Transfer | రాష్ట్రంలో పలువురు మున్సిపల్​ కమిషనర్​లను తెలంగాణ ప్రభుత్వం (Telangana government)...

    District Court Judgement | ఆటోతో ఢీ కొట్టి ఒకరి మృతికి కారణమైన నిందితుడికి 9 నెలల జైలు

    అక్షరటుడే, కామారెడ్డి : District Court Judgement | అజాగ్రత్తగా ఆటో నడిపి ఒకరి మృతికి కారణమైన నిందితుడికి...

    More like this