ePaper
More
    HomeజాతీయంVande Bharat​ | రైల్వే ప్రయాణికులకు శుభవార్త​.. ఆ స్టేషన్​లో ఆగనున్న వందేభారత్​ ఎక్స్​ప్రెస్

    Vande Bharat​ | రైల్వే ప్రయాణికులకు శుభవార్త​.. ఆ స్టేషన్​లో ఆగనున్న వందేభారత్​ ఎక్స్​ప్రెస్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vande Bharat​ | రైల్వే శాఖ ప్రయాణికుల సౌకర్యార్థం అనేక చర్యలు చేపడుతోంది. ఇప్పటికే వేగంగా వెళ్లడానికి ఆధునిక హంగులతో పలు మార్గాల్లో వందే భారత్​ రైళ్లను (Vande Bharat Trains) నడుపుతోంది. వేగంగా గమ్యస్థానాలకు చేరుస్తున్న ఈ రైళ్లలో రద్దీ అధికంగా ఉంటుంది.

    వందేభారత్​ రైళ్లకు మంచి స్పందన వస్తుండడంతో రైల్వే శాఖ మరిన్ని రైళ్లు అందుబాటులోకి తెస్తోంది. ప్రయాణికుల (Passengers) రద్దీ అధికంగా ఉండే ముఖ్యమైన మార్గాల్లో వీటిని ప్రవేశ పెడుతోంది. ప్రజల వినతుల మేరకు కొన్ని రైళ్లను పొడిగిస్తుండగా.. మరికొన్ని రైళ్ల స్టేషన్లలో హాల్టింగ్​ సౌకర్యం కల్పిస్తోంది. తాజాగా కాచిగూడ నుంచి బెంగళూరు (యశ్వంత్​పూర్) మధ్య వందే భారత్ ఎక్స్​ప్రెస్ రైలుపై కీలక ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్​లోని హిందూపురం (Hindupuram) స్టేషన్​లో ఈ రైలుకు హాల్టింగ్​ సౌకర్యం కల్పిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల డిమాండ్​ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ సహాయమంత్రి సోమణ్ణ తెలిపారు.

    Vande Bharat​ | ధర ఎక్కువయినా..

    వందే భారత్​ రైళ్లు మిగతా ట్రెయిన్లతో పోలిస్తే ప్రత్యేకంగా ఉంటాయి. వేగంగా వెళ్లడంతో పాటు ఇందులో ఆధునిక సౌకర్యాలు ఉంటాయి. దీంతో ధర ఎక్కువయినా వీటిలో ఎక్కడానికి ప్రయాణికులు ఆసక్తి చూపుతున్నారు. ప్రయాణికుల ఆదరణ, రద్దీ మేరకు పలు మార్గాల్లో వందే భారత్​ రైళ్ల సంఖ్యను కేంద్రం పెంచుతోంది. తాజాగా కాచిగూడ- యశ్వంత్​పూర్ (Kacheguda- Yeshwantpur) వందే భారత్ ఎక్స్​ప్రెస్​ రైలుకు హిందూపురంలో హాల్టింగ్​ కల్పించింది. ప్రస్తుతం ఈ ట్రైన్​ ఐదు స్టేషన్లలో ఆగుతుంది.

    కాచిగూడ నుంచి ప్రారంభం అయిన తర్వాత మహబూబ్ నగర్, కర్నూలు సిటీ, అనంతపురం, ధర్మవరం స్టేషన్​లో వందేభారత్​ ట్రెయిన్​కు ఇప్పటి వరకు హాల్టింగ్​ ఉంది. ఇక నుంచి హిందూపురంలో కూడా ఆగనుంది. దీంతో హిందూపురం చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఎంతో మేలు జరగనుంది. బుధవారం మినహాయించి వారానికి ఆరు రోజులు ఈ రైలు రాకపోకలు సాగిస్తోంది. తెల్లవారు జామున 5:45 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరే వందేభారత్​ ఎక్స్​ప్రెస్ మధ్యాహ్నం 2 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. మధ్యాహ్నం 2:45 గంటలకు అక్కడి నుంచి తిరిగి ప్రారంభం అవుతుంది. రాత్రి 11 గంటలకు కాచిగూడకు వస్తుంది.

    Latest articles

    Vice-Presidential elections | రసవత్తంగా రెండో అత్యున్నత రాజ్యాంగ పదవి ఎన్నిక.. అసలు ఏమిటీ ఉపరాష్ట్రపతి పదవి..?

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice-Presidential elections : భారత్​లో ఉపరాష్ట్రపతి ఎన్నికలు రసవత్తంగా మారాయి. ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్‌ఖడ్ తన...

    Operation Sindoor lessons | ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో ఆపరేషన్‌ సిందూర్‌ పాఠాలు

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Operation Sindoor lessons : ఆపరేషన్​ సిందూర్​.. పహల్గావ్​ ఉగ్రదాడి (Pahalgaon terror attack) తర్వాత...

    Municipal Commissioners Transfer | మున్సిపల్​ కమిషనర్​ల బదిలీ.. నిజామాబాద్​కు​ యాదగిరి రావు

    అక్షరటుడే, హైదరాబాద్: Municipal Commissioners Transfer | రాష్ట్రంలో పలువురు మున్సిపల్​ కమిషనర్​లను తెలంగాణ ప్రభుత్వం (Telangana government)...

    District Court Judgement | ఆటోతో ఢీ కొట్టి ఒకరి మృతికి కారణమైన నిందితుడికి 9 నెలల జైలు

    అక్షరటుడే, కామారెడ్డి : District Court Judgement | అజాగ్రత్తగా ఆటో నడిపి ఒకరి మృతికి కారణమైన నిందితుడికి...

    More like this