ePaper
More
    Homeబిజినెస్​Stock Markets | ఐదో రోజూ లాభాలే.. 25 వేలకు పైన నిలదొక్కుకున్న నిఫ్టీ

    Stock Markets | ఐదో రోజూ లాభాలే.. 25 వేలకు పైన నిలదొక్కుకున్న నిఫ్టీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Markets | జీఎస్టీ రిఫార్మ్స్‌పై ఆశావహ దృక్పథంతో ఇన్వెస్టర్లు పాజిటివ్‌గా నిలుస్తున్నారు. దీంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు (Domestic stock markets) వరుసగా ఐదో సెషన్‌లోనూ లాభాలతో ముగిశాయి.

    బుధవారం ఉదయం సెన్సెక్స్‌ (Sensex) 27 పాయింట్ల స్వల్ప లాభంతో ప్రారంభమై వెంటనే 177 పాయింట్లు కోల్పోయింది. అక్కడినుంచి కోలుకుని 491 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 15 పాయింట్ల స్వల్ప నష్టంతో ప్రారంభమై మరో 36 పాయింట్లు తగ్గింది. కనిష్టాల వద్ద లభించిన మద్దతుతో కోలుకుని 159 పాయింట్లు పెరిగింది. చివరికి సెన్సెక్స్‌ 213 పాయింట్ల లాభంతో 81,857 వద్ద, నిఫ్టీ(NIfty) 69 పాయింట్ల లాభంతో 25,05 వద్ద స్థిరపడ్డాయి.

    Stock Markets | అడ్వాన్సెస్‌ అండ్‌ డిక్లయిన్స్‌..

    బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 2,343 కంపెనీలు లాభపడగా 1,725 స్టాక్స్‌ నష్టపోయాయి. 167 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 142 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 53 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 9 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌ను, 7 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి.

    Stock Markets | ఐటీలో దూకుడు..

    ఐటీ స్టాక్స్‌ (IT Stocks) దుమ్మురేపాయి. బీఎస్‌ఈలో ఐటీ ఇండెక్స్‌(IT index) 2.70 శాతం పెరగ్గా.. ఎఫ్‌ఎంసీజీ 1.36 శాతం, రియాలిటీ 1.04 శాతం, పవర్‌ 0.52 శాతం, టెలికాం 0.68 శాతం, మెటల్‌ ఇండెక్స్‌ 0.49 శాతం లాభాలతో ముగిశాయి. బ్యాంకెక్స్‌(Bankex) 0.33 శాతం, ఎనర్జీ 0.15 శాతం నష్టపోయాయి. మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.38 శాతం, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.30 శాతం, లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.28 శాతం లాభపడ్డాయి.

    Stock Markets | Top gainers..

    బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 15 కంపెనీలు లాభాలతో, 15 కంపెనీలు నష్టాలతో ముగిశాయి.
    ఇన్ఫోసిస్‌ 3.88 శాతం, టీసీఎస్‌ 2.69 శాతం, హెచ్‌యూఎల్‌ 2.48 శాతం, ఎన్టీపీసీ 2.10 శాతం, టాటా స్టీల్‌ 1.79 శాతం లాభాలతో ముగిశాయి.

    Stock Markets | Top losers..

    బీఈఎల్‌ 2.16 శాతం, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.64 శాతం, టాటా మోటార్స్‌ 1.49 శాతం, ట్రెంట్‌ 0.82 శాతం, ఐటీసీ 0.75 శాతం నష్టపోయాయి.

    Latest articles

    Operation Sindoor lessons | ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో ఆపరేషన్‌ సిందూర్‌ పాఠాలు

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Operation Sindoor lessons : ఆపరేషన్​ సిందూర్​.. పహల్గావ్​ ఉగ్రదాడి (Pahalgaon terror attack) తర్వాత...

    Municipal Commissioners Transfer | మున్సిపల్​ కమిషనర్​ల బదిలీ.. నిజామాబాద్​కు​ యాదగిరి రావు

    అక్షరటుడే, హైదరాబాద్: Municipal Commissioners Transfer | రాష్ట్రంలో పలువురు మున్సిపల్​ కమిషనర్​లను తెలంగాణ ప్రభుత్వం (Telangana government)...

    District Court Judgement | ఆటోతో ఢీ కొట్టి ఒకరి మృతికి కారణమైన నిందితుడికి 9 నెలల జైలు

    అక్షరటుడే, కామారెడ్డి : District Court Judgement | అజాగ్రత్తగా ఆటో నడిపి ఒకరి మృతికి కారణమైన నిందితుడికి...

    Agni-5 missile | అగ్ని-5 మిస్సైల్‌ పరీక్ష విజయవంతం.. 5 వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగల బాలిస్టిక్‌ క్షిపణి

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Agni-5 missile : సుమారు 5,000 కి.మీ దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల లాంగ్ రేంజ్ బాలిస్టిక్...

    More like this