ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిCars Rent | కార్ల అమ్మకం పేరిట మోసం.. ఫేక్​ ఆర్సీలతో అద్దె కార్ల విక్రయం

    Cars Rent | కార్ల అమ్మకం పేరిట మోసం.. ఫేక్​ ఆర్సీలతో అద్దె కార్ల విక్రయం

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి : Cars Rent | కార్ల అమ్మకం పేరిట కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. చాలా మంది మధ్య తరగతి వారు సెకండ్​ హ్యాండ్​లో కార్లు (second hand Cars) కొనుగోలు చేస్తుంటారు. కొత్త కారు కొనుగోలు చేసే స్థోమత లేక యూజ్​డ్​ వెహికిల్స్​ కొంటారు.

    పాత కార్లు విక్రయించే పలువురు సోషల్ మీడియాలో (Social Media) ప్రచారం చేస్తున్నారు. అయితే వీరిలో పలువురు మోసగాళ్లు కూడా ఉంటున్నారు అసలు కారే లేకున్నా విక్రయించి లక్షలు సంపాదిస్తున్నారు. ఇలాంటి ఓ ముఠాను కామారెడ్డి పోలీసులు (Kamareddy Police) తాజాగా అరెస్ట్​ చేశారు.

    కొంత మంది వ్యక్తులు ముఠాగా ఏర్పడి కార్ల విక్రయాల పేరిట మోసాలకు పాల్పడుతున్నారు. అద్దెకు తెచ్చుకున్న వాహనాన్ని విక్రయించి లక్షలు సంపాదిస్తున్నారు. అనంతరం కారు కొనుగోలు చేసిన వారిని బెదిరించి మళ్లీ ఆ కారును లాక్కుంటున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఏడుగురు ఓ గ్యాంగ్​గా ఏర్పడ్డారు. వీరు సెల్ఫ్​ డ్రైవింగ్​ పేరిట కారు అద్దెకు తీసుకుంటారు. అనంతరం దానికి నకిలీ ఆర్సీ (Fake RC), ఇతర పత్రాలు, నంబర్​ ప్లేట్​ సృష్టిస్తారు. ఆ కారు విక్రయిస్తామని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేస్తారు.

    Cars Rent | జీపీఎస్​ ట్రాకర్​ సాయంతో..

    సోషల్​ మీడియాలో పోస్ట్​ చూసి ఎవరైనా కారు అవసరం ఉన్న వారు వీరికి ఫోన్​ చేయగానే అద్దె కారును అమ్మేస్తారు. గ్యాంగ్​లోని కొందరు వ్యక్తులు కారు, నకిలీ పత్రాలు ఇచ్చి డబ్బులు తీసుకుంటారు. అయితే అంతకు ముందే ఆ కారుకు వీరు జీపీఎస్​ ట్రాకర్​ (GPS Tracker) అమరుస్తారు. రెండు మూడు రోజుల తర్వాత గ్యాంగ్​లోని మరికొంత మంది వ్యక్తులు కారు ఓనర్​ దగ్గరకు వెళ్తారు. జీపీఎస్​ ట్రాకర్ అమర్చి ఉండటంతో కారు ఎక్కడుందో అక్కడికి నేరుగా వెళ్తారు. ఆ కారు తమదని, ఎలా కొనుగోలు చేశావని బెదిరింపులకు పాల్పడుతారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని భయపెట్టి కారు తీసుకొని వెళ్లిపోతారు. అనంతరం ఆ కారును అద్దెకు తెచ్చిన వారికి అప్పగిస్తారు. అలా వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తారు.

    Cars Rent | బయటపడిందిలా..

    కామారెడ్డికి చెందిన ప్రశాంత్ గౌడ్ గత నెలలో ఫేస్​బుక్లో పోస్టు (Facebook post) చూసి కారు కొనుగోలు చేశాడు. అయితే ఈ గ్యాంగ్​ అతడిని బెదిరించి మళ్లీ కారు తీసుకు వెళ్లారు. దీంతో బాధితుడు మాచారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయగా ముఠా మోసాలు వెలుగులోకి వచ్చాయి. ఏడుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఫేక్ ఆర్సీ, ఫేక్ నంబర్ పేట్లతో కార్లను విక్రయించి తిరిగి చోరీలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితుల్లో ఆరుగురిని అరెస్ట్ చేశారు.

    Cars Rent | జాగ్రత్తలు పాటించాలి

    -రాజేష్ చంద్ర, ఎస్పీ, కామారెడ్డి

    సోషల్​ మీడియాలో చూసి వాహనాలు, ఇతర వస్తువులు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. వాహనాలకు సంబంధించిన పత్రాలను ఆన్​లైన్​లో చెక్​ చేసుకోవాలి. నకిలీ పత్రాలతో మోసాలకు పాల్పడుతున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎవరిని పడితే వారిని నమ్మొద్దు.

    Latest articles

    Allu Arjun | అల్లు అర్జున్- అట్లీ సినిమాలో విల‌న్‌గా త‌మిళ సూప‌ర్ స్టార్.. అంచ‌నాలు పీక్స్‌కి..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) న‌టించిన పుష్ప 2...

    Stock Market | ఆరో రోజూ కొనసాగిన లాభాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు (Domestic stock markets) లాభాల బాటలో పయనిస్తున్నాయి....

    Traffic signals | పనిచేయని ట్రాఫిక్​ సిగ్నళ్లతో అవస్థలెన్నో..

    అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Traffic signals | నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడం వల్ల ట్రాఫిక్స మస్యలు వస్తున్నాయి....

    Kamareddy SP | అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy SP | మాయమాటలు చెప్పి చోరీలకు పాల్పడుతున్న నలుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను...

    More like this

    Allu Arjun | అల్లు అర్జున్- అట్లీ సినిమాలో విల‌న్‌గా త‌మిళ సూప‌ర్ స్టార్.. అంచ‌నాలు పీక్స్‌కి..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) న‌టించిన పుష్ప 2...

    Stock Market | ఆరో రోజూ కొనసాగిన లాభాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు (Domestic stock markets) లాభాల బాటలో పయనిస్తున్నాయి....

    Traffic signals | పనిచేయని ట్రాఫిక్​ సిగ్నళ్లతో అవస్థలెన్నో..

    అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Traffic signals | నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడం వల్ల ట్రాఫిక్స మస్యలు వస్తున్నాయి....