అక్షరటుడే, నిజాంసాగర్: Mla Laxmi Kantha rao | దూరదృష్టితో దేశ అభివృద్ధికి పునాది వేసిన వ్యక్తి మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ (Rajiv gandhi) అని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. రాజీవ్‌గాంధీ జయంతి (rajiv Gandhi jayanthi) వేడులను జుక్కల్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో బుధవారం నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశాన్ని ప్రపంచదేశాలతో పోటీ పడేలా మార్చిన వ్యక్తి రాజీవ్‌గాంధీ అని అన్నారు. యువత రాజకీయాల్లోకి వచ్చి దేశాభివృద్ధికి పాటుపడాలని చెబుతుండేవారని.. ఓటుహక్కును 21 ఏళ్ల ఉంచి 18ఏళ్లకు తగ్గించడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను పునికిపుచ్చుకున్న రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడమే కాంగ్రెస్ కార్యకర్తల లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కల్లెడిలో..
అక్షరటుడే, ఆర్మూర్: ఆలూర్(Alur) మండలంలోని కల్లెడి గ్రామంలో భారతరత్న, దివంగత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ జయంతిని కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు. దేశంలో ఐటీ రంగానికి పునాదులు వేసి, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో మార్గదర్శిగా నిలిచిన మహనీయుడి సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు నిలగిరి శ్రీనివాస్, మహేష్, హబీబ్, నర్సారెడ్డి, ఎడ్ల పోశెటి, కృష్ణ, నార్సింగి, మోహన్, ధర్మాన్న, వెంకటి తదితరులు పాల్గొన్నారు.
కల్లెడి గ్రామంలో రాజీవ్‌గాంధీ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ నాయకులు