ePaper
More
    HomeతెలంగాణVehicles Check | స్కూటీతో ఢీకొనడంతో కానిస్టేబుల్​కు తీవ్రగాయాలు.. వాహనాలు తనిఖీ చేస్తుండగా ఘటన

    Vehicles Check | స్కూటీతో ఢీకొనడంతో కానిస్టేబుల్​కు తీవ్రగాయాలు.. వాహనాలు తనిఖీ చేస్తుండగా ఘటన

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vehicles Check | పోలీసులు నిత్యం వాహనాల తనిఖీలు (vehicle checks) చేపడుతుంటారు. వాహనదారులు నిబంధనలు పాటించకపోతే జరిమానాలు విధిస్తారు. తనిఖీల సమయంలో కొందరు నేరస్తులు సైతం పోలీసులకు చిక్కుతారు. అయితే వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి కొందరు తప్పించుకోవాలని చూస్తారు. మరికొందరేమో పోలీసులపైకి వాహనాలు తీసుకొస్తున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుండటంతో పోలీసులు ఆందోళన చెందుతున్నారు.

    వాహనాల తనిఖీ చేపడుతున్న కానిస్టేబుల్​ను (constable) ఓ వ్యక్తి స్కూటీతో ఢీకొన్నాడు. దీంతో సదరు కానిస్టేబుల్​కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri district) పంతంగి టోల్​ప్లాజా వద్ద చోటు చేసుకుంది. సాధారణ తనిఖీల్లో భాగంగా పోలీసులు మంగళవారం సాయంత్రం టోల్​ ప్లాజా (Pantangi toll plaza) చెకింగ్​ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి స్కూటీపై వేగంగా దూసుకు వచ్చాడు. పోలీసులు అతడిని ఆపడానికి యత్నించడంతో మరింత వేగం పెంచాడు. ఈ క్రమంలో ఓ కానిస్టేబుల్​ను ఢీకొన్నాడు.

    Vehicles Check | తీవ్ర గాయాలు

    స్కూటీ (scooter) ఢీకొనడంతో కానిస్టేబుల్ ఆసిఫ్​​కు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్పందించి తోటి సిబ్బంది అతడిని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్​లోని (Hyderabad) యశోద ఆస్పత్రికి పంపించారు. కాగా ప్రమాదానికి కారణమైన వ్యక్తి పేరు విశాల్​ అని పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు టోల్​ప్లాజా వద్ద గల సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. కానిస్టేబుల్​ను ఢీకొన్న అనంతరం సదరు వాహనదారుడు సైతం కింద పడ్డాడు.

    View this post on Instagram

    A post shared by Akshara Today (@aksharatoday)

    Latest articles

    Operation Sindoor lessons | ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో ఆపరేషన్‌ సిందూర్‌ పాఠాలు

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Operation Sindoor lessons : ఆపరేషన్​ సిందూర్​.. పహల్గావ్​ ఉగ్రదాడి (Pahalgaon terror attack) తర్వాత...

    Municipal Commissioners Transfer | మున్సిపల్​ కమిషనర్​ల బదిలీ.. నిజామాబాద్​కు​ యాదగిరి రావు

    అక్షరటుడే, హైదరాబాద్: Municipal Commissioners Transfer | రాష్ట్రంలో పలువురు మున్సిపల్​ కమిషనర్​లను తెలంగాణ ప్రభుత్వం (Telangana government)...

    District Court Judgement | ఆటోతో ఢీ కొట్టి ఒకరి మృతికి కారణమైన నిందితుడికి 9 నెలల జైలు

    అక్షరటుడే, కామారెడ్డి : District Court Judgement | అజాగ్రత్తగా ఆటో నడిపి ఒకరి మృతికి కారణమైన నిందితుడికి...

    Agni-5 missile | అగ్ని-5 మిస్సైల్‌ పరీక్ష విజయవంతం.. 5 వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగల బాలిస్టిక్‌ క్షిపణి

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Agni-5 missile : సుమారు 5,000 కి.మీ దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల లాంగ్ రేంజ్ బాలిస్టిక్...

    More like this