ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​Airports Authority of India | ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగావకాశాలు.. ఎంపికైతే రూ....

    Airports Authority of India | ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగావకాశాలు.. ఎంపికైతే రూ. 1.40 లక్షల వరకు వేతనం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Airports Authority of India | ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (AAI) జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆర్కిటెక్చర్‌, సివిల్‌ (Civil), ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విభాగాలలో 976 పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులనుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌(Notification) వివరాలు..

    పోస్టులు..

    మొత్తం పోస్టుల సంఖ్య : 976.

    విభాగాలవారీగా..

    1. జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌(ఆర్కిటెక్చర్‌) : 11
    2. జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌(సివిల్‌) : 199
    3. జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌(ఎలక్ట్రికల్‌) : 208
    4. జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌(ఎలక్ట్రానిక్స్‌) : 527
    5. జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌(ఐటీ) : 31

    విద్యార్హతలు : ఆర్కిటెక్చర్‌ (Architecture), ఇంజినీరింగ్‌ (సివిల్‌/ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రానిక్స్‌), కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌, ఐటీ వంటి సంబంధిత సబ్జెక్టులలో బ్యాచిలర్‌ డిగ్రీ (Bachelor Degree) పూర్తి చేసినవారు అర్హులు. అభ్యర్థులు గేట్‌ పరీక్ష చెల్లుబాటు అయ్యే స్కోర్‌ కార్డ్‌ను కలిగి ఉండాలి.

    వయోపరిమితి : 27 సెప్టెంబర్‌ నాటికి 27 ఏళ్లలోపు వారు అర్హులు. ఎస్సీ(SC), ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

    వేతనం వివరాలు : జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌గా (Junior Executive) ఎంపికయ్యేవారికి నెలకు రూ. 40 వేల నుంచి రూ. 1.40లక్షల వరకు వేతనం లభిస్తుంది. దీంతో పాటు వైద్య, పెన్షన్‌, ప్రయాణ భత్యం వంటి ఇతర అలవెన్సులు, సౌకర్యాలు కూడా ఉంటాయి.

    దరఖాస్తు ప్రారంభ తేదీ : ఈనెల 28.
    దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్‌ 27.
    దరఖాస్తు రుసుము : జనరల్‌ (General), ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ అభ్యర్థులు రూ. 300 దరఖాస్తు రుసుము చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

    దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ ద్వారా..
    ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా వెబ్‌సైట్‌ https://www.aai.aero ను సంప్రదించాలి.
    కెరీర్స్‌ విభాగానికి వెళ్లి జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ రిక్రూట్‌మెంట్‌ లింక్‌ను ఎంచుకోవాలి.
    అప్లికేషన్‌ ఫాం పూరించి అవసరమైన పత్రాలను అప్‌లోడ్‌ చేయాలి.
    దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్‌లోనే సమర్పించాలి. దరఖాస్తు ఫామ్‌ను ప్రింటవుట్‌ తీసుకోవాలి.

    More like this

    Best Teacher Award | నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలి

    అక్షరటుడే, ఇందూరు : Best Teacher Award | విద్యార్థులకు కేవలం మార్కులు, ర్యాంకుల చదువులు కాకుండా.. నైతిక...

    Kaloji Narayana Rao | ఘనంగా ప్రజాకవి కాళోజీ జయంతి

    అక్షరటుడే, ఇందూరు: Kaloji Narayana Rao | ప్రజాకవి కాళోజీ నారాయణ రావు జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు....

    National Highway | అదుపు తప్పిన టిప్పర్.. తప్పిన భారీ ప్రమాదం

    అక్షరటుడే, డిచ్​పల్లి: National Highway | మండలంలోని 44వ జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది....