అక్షరటుడే, బాన్సువాడ: Banswada RTC | ఆర్టీసీకి ఆదాయాన్ని పెంచే మార్గాలను అన్వేషించాలని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోలోమన్ పేర్కొన్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
బాన్సువాడ ఆర్టీసీ డిపోను (Banswada RTC Depot) బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బందితో సమావేశమాయ్యారు. సంస్థ ఆదాయాన్ని పెంచే మార్గాలు, ఖర్చులను తగ్గించే చర్యలపై సలహాలు సూచనలు ఇచ్చారు.
అందరూ బాధ్యతతో పనిచేయాలని సూచించారు. అనంతరం డిపో ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ జ్యోత్స్న, డిప్యూటీ రీజినల్ మేనేజర్ మధుసూదన్, బాన్సువాడ డిపో మేనేజర్ సరితా దేవి పాల్గొన్నారు.