ePaper
More
    HomeసినిమాNandamuri Balakrishna | క‌న్నీళ్లు పెట్టుకున్న బాల‌కృష్ణ‌.. ఆయన‌ను ఎప్పుడు ఇలా చూడ‌లేదుగా..!

    Nandamuri Balakrishna | క‌న్నీళ్లు పెట్టుకున్న బాల‌కృష్ణ‌.. ఆయన‌ను ఎప్పుడు ఇలా చూడ‌లేదుగా..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nandamuri Balakrishna | నంద‌మూరి ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెల‌కొంది. నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ మంగళవారం ఉదయం అనారోగ్యంతో కన్నుమూసిన విష‌యం తెలిసిందే. ఆమె మరణ వార్త నందమూరి కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది.

    ఆమె భౌతికకాయానికి నివాళులర్పించేందుకు కుటుంబ సభ్యులు, రాజకీయ నాయకులు, అభిమానులు హైదరాబాద్‌లోని నివాసానికి భారీగా త‌ర‌లివ‌చ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(AP CM Nara Chandrababu Naidu), మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh), హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆమె భౌతికకాయాన్ని సందర్శించి, నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

    నంద‌మూరి బాల‌కృష్ణ‌.. ప‌ద్మ‌జ (Padmaja) మృతితో క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు. ఎప్పుడు గంభీరంగా ఉండే బాల‌య్య ఇలా క‌న్నీరు పెట్టుకోవ‌డం చూసి అభిమానులు ఎమోష‌న‌ల్ అయ్యారు. ప‌ద్మ‌జ‌.. త‌న‌కు అమ్మ త‌ర్వాత అమ్మ‌లాంటిద‌ని చెప్పారు. స్కూల్‌కు వెళ్లే స‌మ‌యంలో త‌న బాగోగులు అన్ని కూడా తానే చూసేద‌ని బాల‌య్య అన్నారు. అమ్మ‌లేని లోటు (Nandamuri Balakrishna) ఎప్పుడు తెలియ‌నివ్వ‌లేద‌ని బాల‌య్య అన్నారు. ‘నాన్నగారు, అమ్మ చెన్నైలో ఉండేవారు. మా చిన్ననాటి రోజుల్లో స్కూల్‌కు వెళ్లే నుంచి అన్నీ వదినగారే చూసుకునే వారు. ఎక్కడికైనా వెళ్లాలన్నా, ఏం కావాలన్నా ఆమెతోనే చెప్పుకునే వాళ్లం. నాన్నగారు చాలా కఠినంగా ఉండేవారు. వారిని ఒప్పించి మమ్మల్ని బయటకు తీసుకెళ్లేది వదినగారే. అలాంటి ఆమె ఇక లేరంటే ఎంతో బాధగా ఉంది. భగవంతుడు ఆమె ఆత్మకు శాంతిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను’ అని అన్నారు. ప్ర‌స్తుతం బాల‌య్య‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

    మ‌రోవైపు పరామర్శ అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు, పద్మజతో తన బంధాన్ని గుర్తుచేసుకున్నారు.”జయకృష్ణ, పద్మజ గారు పెద్దలుగా నిలబడి నా పెళ్లి చేశారు. మా అత్తగారు చెన్నైలో ఉంటే, హైదరాబాద్‌లో కుటుంబ బాధ్యతలన్నీ పద్మజే చూసుకునేవారు. అందరితో క‌లివిడిగే ఉండే స్వభావం ఆమెది. ఎవరికి ఏం కావాలన్నా ఆమె ద‌గ్గ‌రుండి చూసుకునేది. ఆమె మ‌ర‌ణం మాకు తీరని లోటు. జయకృష్ణ గారితో మొదట స్నేహంగా ప్రారంభమైన బంధం తర్వాత కుటుంబ సంబంధంగా మారింది. జయకృష్ణ కుటుంబానికి మేమంతా మద్దతుగా ఉంటాం’ అని చెప్పారు.

    Latest articles

    Agni-5 missile | అగ్ని-5 మిస్సైల్‌ పరీక్ష విజయవంతం.. 5 వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగల బాలిస్టిక్‌ క్షిపణి

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Agni-5 missile : సుమారు 5,000 కి.మీ దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల లాంగ్ రేంజ్ బాలిస్టిక్...

    Yavatmal | నిజామాబాద్ టు యావత్మల్​.. జోరుగా సాగుతున్న జూదం

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Yavatmal | నిజామాబాద్​ కమిషనరేట్​ (Nizamabad Commissionerate) పరిధిలో జూదం పట్ల పోలీసులు కఠినంగా...

    Social Media | సోషల్ మీడియాకు బానిసయ్యారా.. ఇలా చేస్తే బయటపడొచ్చు…

    అక్షరటుడే, హైదరాబాద్ : Social Media | సోషల్ మీడియా.. ఈ ఆధునిక ప్రపంచంలో ఒక విడదీయరాని భాగం....

    Indiramma Illu | ఇందిరమ్మ ఇళ్ల కోసం లంచం డిమాండ్​ చేసిన ఏఈ.. ఆడియో వైరల్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indiramma Illu | పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు కాంగ్రెస్​ ప్రభుత్వం (Congress Govt)...

    More like this