ePaper
More
    HomeతెలంగాణWine Shops | మద్యం దుకాణాల లైసెన్స్​ల జారీకి నోటిఫికేషన్​.. దరఖాస్తు ఫీజు భారీగా పెంపు

    Wine Shops | మద్యం దుకాణాల లైసెన్స్​ల జారీకి నోటిఫికేషన్​.. దరఖాస్తు ఫీజు భారీగా పెంపు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Wine Shops | రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్స్​ల జారీకి ప్రభుత్వం నోటిఫికేషన్​ విడుదల చేసింది. రాష్ట్రంలో రెండు సంవత్సరాలకు ఒకసారి మద్యం దుకాణాల కోసం టెండర్లు నిర్వహిస్తారు. 2025 డిసెంబర్​ 1 నుంచి 2027 నవంబర్​ 30 వరకు లైసెన్స్​ల కోసం తాజాగా నోటిఫికేషన్​ విడుదల చేసింది.

    రాష్ట్రంలో మద్యం దుకాణాల (Liquor Stores) కోసం దరఖాస్తు చేసుకోవడానికి గతంలో రూ.రెండు లక్షలు ఫీజు వసూలు చేసేవారు. ప్రస్తుతం దానిని రూ.3 లక్షలకు పెంచారు. దీంతో ప్రభుత్వానికి దరఖాస్తుల రూపంలో భారీగా ఆదాయం రానుంది. ఇప్పటికే మద్యం ధరలను (Alcohol Prices) పెంచిన ప్రభుత్వం తాజాగా లైసెన్స్​ల కోసం దరఖాస్తు చేసుకునే ఫీజును పెంచడం గమనార్హం.

    Wine Shops | డ్రా ద్వారా ఎంపిక

    రాష్ట్రంలో మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవడానికి రూ.3 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం డ్రా పద్ధతిలో వైన్​ షాపులను (Wine Shops) ఎంపిక చేస్తారు. డ్రాలో వచ్చిన వారు రెండేళ్ల పాటు మద్యం దుకాణం నిర్వహించుకోవడానికి లైసెన్స్​ ఇస్తారు. ఇందుకోసం మళ్లీ లైసెన్స్​ ఫీజు (License Fee) చెల్లించాల్సి ఉంటుంది.

    Wine Shops | టెండర్లలో రిజర్వేషన్లు

    రాష్ట్రంలో మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో బీఆర్​ఎస్​ ప్రభుత్వం (BRS Government) గౌడ్​లకు రిజర్వేషన్​ అమలు చేయగా.. తాజాగా కాంగ్రెస్​ ఎస్సీ, ఎస్టీలకు కూడా రిజర్వేషన్​ అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. గౌడ్‌లకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించింది. 6 శ్లాబ్‌లలో లైసెన్స్‌లు జారీ చేయాలని ఎక్సైజ్​ శాఖ (Excise Department) నిర్ణయించింది.

    Wine Shops | లైసెన్స్​ ఫీజులు

    2011 జనాభా లెక్కలను అనుసరించి 5 వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.50లక్షల లైసెన్స్ ఫీజు నిర్ణయించారు. 5 వేల నుంచి 50వేల జనాభా గల ప్రాంతాల్లో దుకాణాలకు రూ.55 లక్షలు, 50 వేల నుంచి లక్ష జనాభా ఉన్న ఏరియాల్లో రూ.60 లక్షలుగా నిర్ణయించారు. లక్ష నుంచి 5 లక్షల జనాభాకు రూ.65 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల జనాభాకు రూ.85 లక్షలు, 20 లక్షలపై చిలుకు జనాభా గల ప్రాంతంలోని దుకాణాలకు రూ.కోటి పది లక్షల ఫీజు నిర్ణయించారు.

    Latest articles

    District Court Judgement | ఆటోతో ఢీ కొట్టి ఒకరి మృతికి కారణమైన నిందితుడికి 9 నెలల జైలు

    అక్షరటుడే, కామారెడ్డి : District Court Judgement | అజాగ్రత్తగా ఆటో నడిపి ఒకరి మృతికి కారణమైన నిందితుడికి...

    Agni-5 missile | అగ్ని-5 మిస్సైల్‌ పరీక్ష విజయవంతం.. 5 వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగల బాలిస్టిక్‌ క్షిపణి

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Agni-5 missile : సుమారు 5,000 కి.మీ దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల లాంగ్ రేంజ్ బాలిస్టిక్...

    Yavatmal | నిజామాబాద్ టు యావత్మల్​.. జోరుగా సాగుతున్న జూదం

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Yavatmal | నిజామాబాద్​ కమిషనరేట్​ (Nizamabad Commissionerate) పరిధిలో జూదం పట్ల పోలీసులు కఠినంగా...

    Social Media | సోషల్ మీడియాకు బానిసయ్యారా.. ఇలా చేస్తే బయటపడొచ్చు…

    అక్షరటుడే, హైదరాబాద్ : Social Media | సోషల్ మీడియా.. ఈ ఆధునిక ప్రపంచంలో ఒక విడదీయరాని భాగం....

    More like this