ePaper
More
    Homeక్రీడలుAsia Cup 2025 | ఆసియా కప్ 2025: భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌పై ఇంకా...

    Asia Cup 2025 | ఆసియా కప్ 2025: భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌పై ఇంకా సందిగ్ధత..అగార్క‌ర్ ఏమ‌న్నాడంటే..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Asia Cup 2025 | 2025 ఆసియా కప్ కోసం టీమిండియా సన్నద్ధమవుతోంది. సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈ వేదికగా జరిగే ఈ టోర్నీ టి20 ఫార్మాట్‌లో జరగనుంది. మంగళవారం భారత జట్టును బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఈసారి సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) సారథ్యంలో టీమిండియా బరిలోకి దిగనుంది.గ్రూప్ Aలో భారత్, పాకిస్థాన్, యూఏఈ, ఒమన్ జ‌ట్లు ఉండ‌గా, గ్రూప్ Bలో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్థాన్, హాంకాంగ్ ఉన్నాయి. ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పోటీ పడనున్నాయి. సెప్టెంబర్ 14న భారత్ – పాకిస్థాన్ మ్యాచ్(India – Pakistan match) జరగాల్సి ఉంది. అయితే, ఇటీవల పహల్గామ్‌లో చోటుచేసుకున్న ఉగ్రదాడి(Pahalgam Terror Attack), దాంతోపాటు దేశవ్యాప్తంగా వస్తున్న వ్యతిరేకతల కారణంగా ఈ మ్యాచ్‌పై ఇంకా స్పష్టత లేదు.

    Asia Cup 2025 | కొన‌సాగుతున్న స‌స్పెన్స్..

    గతంలో వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో భారత్ జట్టు(India Team) పాకిస్థాన్‌తో ఆడేందుకు నిరాకరించిన విష‌యం తెలిసిందే. ఇదే క్ర‌మంలో ఆసియా కప్‌లోనూ భారత్ ఈ మ్యాచ్ ఆడుతుందా లేదా అనే చర్చ జ‌రుగుతుంది. అయితే మీడియా సమావేశంలో ఒక విలేఖరి, సెప్టెంబర్ 14న జరగనున్న భారత్ – పాకిస్థాన్ మ్యాచ్‌పై ప్రశ్నించగా, అగార్కర్(Agarkar) స్పందించేందుకు ప్రయత్నించారు. కానీ వెంటనే బీసీసీఐ(BCCI) మీడియా మేనేజర్ మధ్యలో ఆపుతూ, “జట్టు ఎంపికపై మాత్రమే ప్రశ్నలు అడగండి” అని మీడియాకు స్పష్టం చేశారు. ఈ ఘటనతో మరోసారి భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ జరగుతుందా లేదా అనే అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఇప్పటివరకు బీసీసీఐ లేదా ప్రభుత్వ వర్గాల నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడలేదు.

    టీ20 ఆసియా కప్ 2025 (Aisa Cup 2025)కు టీమిండియా సమగ్రంగా సిద్ధమవుతోంది. అయితే, రాజకీయ, భద్రతా పరిస్థితుల దృష్ట్యా పాకిస్థాన్‌తో జరగాల్సిన మ్యాచ్‌పై ఇంకా అస్పష్టత కొనసాగుతోంది. ఈ విషయంలో తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వ స్థాయిలో తీసుకునే అవకాశం ఉంది. అప్పటివరకు అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూడాల్సిందే.

    ఆసియా క‌ప్ 2025 కోసం భార‌త జట్టు ఇదే..

    సూర్య‌కుమార్ యాద‌వ్ (కెప్టెన్‌), శుభ్‌మ‌న్ గిల్ (వైస్ కెప్టెన్‌), అభిషేక్ శ‌ర్మ‌, తిల‌క్ వ‌ర్మ‌, హార్దిక్ పాండ్యా, శివ‌మ్‌దూబే, అక్ష‌ర్ ప‌టేల్‌, జితేశ్ శ‌ర్మ‌, జ‌స్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, కుల్దీప్ యాద‌వ్‌, సంజూ శాంస‌న్‌, హ‌ర్షిత్ రాణా, రింకూ సింగ్‌.

    Latest articles

    Delhi CM | దాడిపై స్పందించిన ఢిల్లీ ముఖ్యమంత్రి.. తమ నిబద్ధతను విచ్ఛిన్నం చేయలేరన్న రేఖా గుప్తా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Delhi CM | ఢిల్లీ సంక్షేమం కోసం చూపుతున్న తన నిబద్ధతను భౌతికు దాడుల...

    Mla madan Mohan Rao | దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Mla madan Mohan Rao | గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నియోజకవర్గంలో పంటలు...

    Vande Bharat​ | రైల్వే ప్రయాణికులకు శుభవార్త​.. ఆ స్టేషన్​లో ఆగనున్న వందేభారత్​ ఎక్స్​ప్రెస్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vande Bharat​ | రైల్వే శాఖ ప్రయాణికుల సౌకర్యార్థం అనేక చర్యలు చేపడుతోంది. ఇప్పటికే...

    CBI Trap | లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన ఎన్​హెచ్​ఏఐ పీడీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CBI Trap | లంచం తీసుకుంటూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (National Highways...

    More like this