ePaper
More
    HomeతెలంగాణMugpal | అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యం.. కుటుంబ సభ్యులకు అప్పగింత

    Mugpal | అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యం.. కుటుంబ సభ్యులకు అప్పగింత

    Published on

    అక్షరటుడే, మోపాల్​ : Mugpal | గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన బాలుడి ఆచూకీ లభ్యమైంది.  పోలీసులు బాలుడిని పట్టుకొని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మోపాల్ మండలం (Mugpal Mandal) కులాస్​పూర్​ గ్రామానికి చెందిన వడ్డేపల్లి గంగాధర్ మనవడు బొద్దుల వరుణ్ డిచ్​పల్లి ఎస్సీ హాస్టల్​లో (Dichpally SC hostel) ఉంటూ చదువుకుంటున్నాడు. ఇటీవల బాలుడు ఇంటికి వచ్చాడు.

    ఇంట్లో చిన్న గొడవ కావడంతో హాస్టల్​కు వెళ్తున్నానని చెప్పాడు. అయితే హాస్టల్​కు వెళ్లలేదు. దీంతో కుటుంబ సభ్యులు గాలించినా ఆచూకీ లభించలేదు. వారు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. హాస్టల్​కు వెళ్లకుండా రెండు రోజుల నుంచి బస్టాండ్, రైల్వే స్టేషన్ సమీపంలో వరుణ్​​ తిరుగుతున్నట్లు గుర్తించారు. మంగళవారం అర్ధరాత్రి రైల్వే స్టేషన్​లో ఉన్న బాలుడిని రైల్వే పోలీసులు విచారించారు. అనంతరం మోపాల్​ పోలీసులకు అప్పగించారు. మోపాల్ పోలీసులు వరుణ్​ను బుధవారం ఉదయం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

    Latest articles

    Delhi CM | దాడిపై స్పందించిన ఢిల్లీ ముఖ్యమంత్రి.. తమ నిబద్ధతను విచ్ఛిన్నం చేయలేరన్న రేఖా గుప్తా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Delhi CM | ఢిల్లీ సంక్షేమం కోసం చూపుతున్న తన నిబద్ధతను భౌతికు దాడుల...

    Mla madan Mohan Rao | దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Mla madan Mohan Rao | గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నియోజకవర్గంలో పంటలు...

    Vande Bharat​ | రైల్వే ప్రయాణికులకు శుభవార్త​.. ఆ స్టేషన్​లో ఆగనున్న వందేభారత్​ ఎక్స్​ప్రెస్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vande Bharat​ | రైల్వే శాఖ ప్రయాణికుల సౌకర్యార్థం అనేక చర్యలు చేపడుతోంది. ఇప్పటికే...

    CBI Trap | లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన ఎన్​హెచ్​ఏఐ పీడీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CBI Trap | లంచం తీసుకుంటూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (National Highways...

    More like this