ePaper
More
    HomeతెలంగాణSriram Sagar | శ్రీరామ్​సాగర్​కు కొనసాగుతున్న వరద.. 26 గేట్ల ద్వారా నీటి విడుదల

    Sriram Sagar | శ్రీరామ్​సాగర్​కు కొనసాగుతున్న వరద.. 26 గేట్ల ద్వారా నీటి విడుదల

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్​ : Sriram Sagar | శ్రీరామ్​సాగర్​ ప్రాజెక్ట్​కు (SRSP) ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. నిజాంసాగర్​ (Nizam Sagar) గేట్లు ఎత్తడంతో మంజీర ఉప్పొంగి పారుతోంది. మంజీర (Manjira)తో పాటు గోదావరికి వరద పోటెత్తడంతో శ్రీరామ్​సాగర్​కు భారీగా ఇన్​ఫ్లో వస్తోంది.

    ఎస్సారెస్పీకి ప్రస్తుతం 1.65 లక్షల క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. 26 వరద గేట్ల ద్వారా 1,02,850 క్యూసెక్కులు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. కాల్వలు, వరద గేట్ల ద్వారా మొత్తం 1,31,717 క్యూసెక్కుల ఔట్​ ఫ్లో నమోదవుతోంది. ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1087.2 అడుగుల (67.05 టీఎంసీలు) నీరు ఉంది.

    Sriram Sagar | వరద కాలువ ద్వారా..

    శ్రీరామ్​సాగర్​కు ఎగువ నుంచి భారీగా ఇన్​ఫ్లో వస్తుండడంతో వరద కాలువ ద్వారా మిడ్​మానేరు (Mid Maneru)కు నీటిని తరలిస్తున్నారు. మంగళవారం 18 వేల క్యూసెక్కులు వరద కాలువకు విడుదల చేసిన అధికారులు.. బుధవారం 20 వేల క్యూసెక్కులకు పెంచారు. దీంతో సిరిసిల్ల జిల్లాలోని మిడ్​మానేరు ప్రాజెక్ట్​ జలకళను సంతరించుకుంది. మరోవైపు ఎస్సారెస్పీ కాకతీయ కాలువ ద్వారా 5 వేల క్యూసెక్కులు, ఎస్కేప్​ గేట్ల ద్వారా మూడు వేలు, మిషన్​ భగీరథకు 231 క్యూసెక్కులు వదులుతున్నారు.

    Sriram Sagar | పర్యాటకుల సందడి

    శ్రీరామ్​సాగర్​ గేట్లు ఎత్తడంతో పర్యాటకులు (Tourists) తరలివస్తున్నారు. గోదావరి (Godavari) జల సవ్వడులు చూడటానికి వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో వస్తున్నారు. అయితే భద్రతా కారణాలతో అధికారులు పర్యాటకులను వరద గేట్లవైపు వెళ్లడానికి అనుమతించడం లేదు. దీంతో ఆనకట్టపై నుంచి జలాశయం అందాలను తిలకించి ప్రజలు వెనుదిరుగుతున్నారు. ప్రాజెక్ట్​ దిగువన గల నెహ్రూ పార్క్​లో సందడి చేస్తున్నారు. అయితే సౌకర్యాలు లేకపోవడంతో పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు.

    Latest articles

    All India Kisan Congress | కామారెడ్డి కాంగ్రెస్​ నాయకుడికి పాట్నా ఓటర్ అధికార్ ర్యాలీ బాధ్యతలు

    అక్షరటుడే, కామారెడ్డి: All India Kisan Congress | కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి (Devunipally) గ్రామానికి చెందిన...

    Stock Markets | ఐదో రోజూ లాభాలే.. 25 వేలకు పైన నిలదొక్కుకున్న నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Markets | జీఎస్టీ రిఫార్మ్స్‌పై ఆశావహ దృక్పథంతో ఇన్వెస్టర్లు పాజిటివ్‌గా నిలుస్తున్నారు. దీంతో...

    Banswada | ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada | చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు (Teacher) కీచకులుగా మారుతున్నారు. అభంశుభం తెలియని విద్యార్థినులపై...

    Karnataka | సైలెంట్‌గా ఉన్న చిరుత‌ని రెచ్చ‌గొటారు.. చివ‌రికి ఏమైంది.. వైర‌ల్ వీడియో

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karnataka | ఇటీవలకాలంలో సఫారీ టూర్‌లకు వెళ్లే వారి సంఖ్య క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతోంది. అడవుల్లో...

    More like this