ePaper
More
    Homeబిజినెస్​Stock market | నష్టాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. నెగెటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Stock market | నష్టాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. నెగెటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) ఎక్కువగా నష్టాలతో సాగుతున్నాయి. గత ట్రేడింగ్ సెషన్‌లో యూఎస్‌ మార్కెట్లు నష్టాలతో ముగియగా.. యూరోప్‌ మార్కెట్లు లాభాల బాటలో పయనించాయి. బుధవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు ఎక్కువగా నష్టాలతో కనిపిస్తున్నాయి. గిఫ్ట్‌నిఫ్టీ(Gift nifty) సైతం నెగెటివ్‌గా ఉంది.

    Stock market | యూఎస్‌ మార్కెట్లు..

    టెక్‌ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. దీంతో వాల్‌స్ట్రీట్‌(Wallstreet) నష్టాల బాటలో పయనించింది. గత ట్రేడింగ్ సెషన్‌ నాస్‌డాక్‌ 1.49 శాతం, ఎస్‌అండ్‌పీ 0.59 శాతం నష్టపోయింది. ఉదయం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ 0.07 శాతం నష్టంతో సాగుతోంది.

    యూరోప్‌ మార్కెట్లు..

    సీఏసీ(CAC) 1.19 శాతం, డీఏఎక్స్‌ 0.44 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.34 శాతం లాభాలతో ముగిశాయి.

    ఆసియా మార్కెట్లు..

    వాల్‌స్ట్రీట్‌లో నష్టాల ప్రభావం ఆసియా మార్కెట్లలో కనిపిస్తున్నాయి. ఉదయం ఎక్కువగా నష్టాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. మంగళవారం ఉదయం 8.10 గంటల సమయంలో షాంఘై(Shanghai) 0.37 శాతం, స్ట్రెయిట్స్‌ టైమ్స్‌ 0.13 శాతం లాభంతో ఉన్నాయి. తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 1.85 శాతం, కోస్పీ 1.70 శాతం, నిక్కీ 1.53 శాతం, హాంగ్‌సెంగ్‌ 0.36 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ ఉంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు గ్యాప్‌ డౌన్‌(Gap down)లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

    గమనించాల్సిన అంశాలు..

    ఎఫ్‌ఐఐలు మళ్లీ నికర అమ్మకందారులుగా మారారు. గత ట్రేడింగ్ సెషన్‌లో నికరంగా రూ. 634 కోట్ల విలువైన స్టాక్స్‌ అమ్మారు. డీఐఐ(DII)లు 31వ ట్రేడింగ్ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా కొనసాగారు. నికరంగా రూ. 2,261 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు.
    నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 1 నుంచి 1.14 కు పెరిగింది. విక్స్‌(VIX) 4.46 శాతం తగ్గి 11.79కు పడిపోయింది.

    • బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 0.22 శాతం తగ్గి 65.93 డాలర్ల వద్ద ఉంది.
    • డాలర్‌తో రూపాయి(Rupee) మారకం విలువ 41 పైసలు బలపడి 86.95 వద్ద నిలిచింది.
    • యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 4.32 శాతం వద్ద, డాలర్‌ ఇండెక్స్‌ 98.42 వద్ద కొనసాగుతున్నాయి.
    • చైనా లోన్‌ ప్రైమ్‌ రేటు(LPR)లో వరుసగా మూడో నెలలోనూ ఎలాంటి మార్పులు చేయలేదు. వార్షిక ఎల్‌పీఆర్‌ 3 శాతం వద్ద, ఐదేళ్ల ఎల్‌పీఆర్‌ 3.5 శాతం వద్ద ఉంది.
    • భారత్‌, చైనాల మధ్య సంబంధాలను మెరుగుపరచుకునే దిశగా రెండు దేశాలు చర్యలు చేపట్టాయి. చైనా ప్రత్యక్ష విమానాలను తిరిగి ప్రారంభించడానికి, వాణిజ్య పెట్టుబడి ప్రవాహాలను పెంచడానికి ఇరు దేశాలు ఓ అంగీకారానికి వచ్చాయి.

    Latest articles

    Collector Kamareddy | కాలుష్య రహిత పర్యావరణాన్ని నెలకొల్పాలి

    అక్షరటుడే,లింగంపేట: Collector Kamareddy | కాలుష్య రహిత పర్యావరణాన్ని నెలకొల్పేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్​ ఆశిష్ సంగ్వాన్...

    Dinesh Kulachary | స్థానిక సంస్థల ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరేస్తాం

    అక్షరటుడే, ఇందూరు: Dinesh Kulachary | స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body elections) కాషాయ జెండా ఎగరేయడం...

    National Rakta Veer Awards | కామారెడ్డి వాసులకు జాతీయ రక్తవీర్ పురస్కారాలు

    అక్షరటుడే, కామారెడ్డి: National Raktha Veer Awards | కామారెడ్డి పట్టణ వాసులకు జాతీయస్థాయిలో రక్తవీర్ పురస్కారాలు లభించాయి....

    All India Kisan Congress | కామారెడ్డి కాంగ్రెస్​ నాయకుడికి పాట్నా ఓటర్ అధికార్ ర్యాలీ బాధ్యతలు

    అక్షరటుడే, కామారెడ్డి: All India Kisan Congress | కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి (Devunipally) గ్రామానికి చెందిన...

    More like this

    Collector Kamareddy | కాలుష్య రహిత పర్యావరణాన్ని నెలకొల్పాలి

    అక్షరటుడే,లింగంపేట: Collector Kamareddy | కాలుష్య రహిత పర్యావరణాన్ని నెలకొల్పేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్​ ఆశిష్ సంగ్వాన్...

    Dinesh Kulachary | స్థానిక సంస్థల ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరేస్తాం

    అక్షరటుడే, ఇందూరు: Dinesh Kulachary | స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body elections) కాషాయ జెండా ఎగరేయడం...

    National Rakta Veer Awards | కామారెడ్డి వాసులకు జాతీయ రక్తవీర్ పురస్కారాలు

    అక్షరటుడే, కామారెడ్డి: National Raktha Veer Awards | కామారెడ్డి పట్టణ వాసులకు జాతీయస్థాయిలో రక్తవీర్ పురస్కారాలు లభించాయి....