అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్ : Kamareddy | మహిళను రోకలి కర్రతో కొట్టి హత్య చేసిన యువకుడికి జిల్లా న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష (Life Imprisonment) విధించింది.
వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని శివాజీనగర్ కాలనీ(Shivajinagar Colony)వాసి పండరి కూలిపని చేస్తుండేవాడు. అయితే జల్సాలకు అలవాటు పడ్డ పండరి చోరీలకు పాల్పడుతూ వచ్చాడు. ఈ క్రమంలో తన ఇంటి వద్ద ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలు కాశవ్వను 2024 సెప్టెంబర్ 29వ తేదీన ఆమె ఇంట్లోనే రోకలికర్రతో తలపై కొట్టి హత్య చేశాడు.
అనంతరం ఆమె మెడలో ఉన్న బంగారు గుండ్లు, చెవికమ్మలు చోరీ చేసి పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న కామారెడ్డి పోలీసులు(Kamareddy Police) విచారణ చేసి అనుమానితుడిగా పండరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు. సాక్ష్యాధారాలు పరిశీంచిన జిల్లా న్యాయస్థానం (District Court) పండరే హత్య చేసినట్లుగా ధృవీకరించి అతడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అలాగే కాశవ్వ షెడ్యూల్డ్ కులానికి చెందిన మహిళగా గుర్తించిన కోర్టు మరో ఐదేళ్ల కారాగార శిక్ష విధించింది. ఈ రెండు శిక్షలు సైతం ఏకకాలంలో అమలు చేయాలని ఆదేశించింది.