అక్షరటుడే, ఆర్మూర్ : Oxford School | పట్టణ శివారులోని గాంధీనగర్ (Gandhi Nagar) ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్థులు ఎస్సెస్సీ ఫలితాల్లో (SSC results) ప్రతిభ చూపారని పాఠశాల కరస్పాండెంట్ మానస గణేష్ తెలిపారు. పాఠశాలకు చెందిన నిత్య 580మార్కులు సాధించి టాపర్గా నిలిచారన్నారు. శృతి 578, అశోక్ 577, వేదవ్యాస్ 575, వనిత 574, జెస్సి 574, వర్షిత్ రెడ్డి 572, హర్షిత్ గౌడ్ 572, కీర్తి 571, ప్రణీత్ 570 సాధించగా మరో 11 మంది విద్యార్థులు 560 నుండి 570 మధ్య మార్కులు సాధించారని వివరించారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను పాలనాధికారిణి పద్మ, ఉపాధ్యాయులు అభినందించారు.