అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Revanth Reddy | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) తెలంగాణ రాష్ట్రంపై మొదటి నుంచి వివక్ష చూపుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఆరోపించారు. యూరియా సరఫరా చేయకుండా ప్రధాని అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
తెలంగాణకు కేంద్రం యూరియా సరఫరా(Urea Supply) చేయకుండా ప్రధాని అడ్డుకుంటున్నారని, మోదీకి మొదటి నుంచి తెలంగాణపై వివక్ష ఉందన్నారు. రాష్ట్ర రైతాంగానికి అవసరం మేరకు యూరియా సరఫరా చేయకుండా వివక్షపూరిత వైఖరి ప్రదర్శిస్తోన్న కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని పార్లమెంట్‌లో రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు ఎండగట్టారని పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో గొంతు కలిపి పార్లమెంట్‌లో తెలంగాణ రైతుల పక్షాన నిలిచిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ(Congress Leader Priyanka Gandhi)కి రేవంత్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
CM Revanth Reddy | బీఆర్ ఎస్ ఎంపీలకు భయమా?
రాష్ట్ర రైతాంగ అవసరాల మేరకు యూరియా సరఫరా చేయాలని రాష్ట్రానికి చెందిన బీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు కేంద్రాన్ని నిలదీయడం లేదని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర రైతాంగానికి అండగా నిలవాల్సిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy), బండి సంజయ్(Bandi Sanjay) మోదీ భజనలో బిజీగా ఉన్నారని విమర్శించారు. “రాష్ట్ర రైతాంగానికి అవసరం మేరకు యూరియా సరఫరా చేయకుండా నిర్లక్ష్య, వివక్ష పూరిత వైఖరి ప్రదర్శిస్తోన్న మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని, మోసపూరిత వైఖరిని ఎండగడుతూ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో గొంతు కలిపి పార్లమెంట్ వేదికగా తెలంగాణ రైతుల పక్షాన నిలిచిన ప్రియాంక గాంధీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
రాష్ట్ర రైతాంగ అవసరాల మేరకు యూరియా సరఫరా చేయాలని మేం లేఖల రూపంలో, విజ్ఞప్తుల రూపంలో పదే పదే కోరినా కేంద్రం స్పందించకపోవడం దారుణం. రాష్ట్ర రైతాంగానికి అండగా నిలవాల్సిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మోదీ భజనలో బిజీగా ఉన్నారు. మన రైతుల కోసం మోదీ సర్కారు(Modi Government) పై ఒత్తిడి తెచ్చేందుకు మాతో కలిసి రావాల్సిన బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో పత్తా లేరు. గల్లీలో లొల్లి చేయడానికి ఉత్సాహం చూపే వాళ్లు ఢిల్లీలో మోదీని ప్రశ్నించడానికి ఎందుకు భయపడుతున్నారు!? మోదీ అంటే భయమా! భక్తా!?” అని రేవంత్‌రెడ్డి తన పోస్టులో ప్రశ్నించారు.